BREAKING
thumb మైలేజ్ కోసం కాదు.. ప్రజల కోసం పని చేయాలి thumb మూలపేటలో ఘనంగా శ్రీ గంగాలమ్మ తల్లి పండగకు ఏర్పాట్లు thumb ఎమ్మెల్యే వేముల వీరేశంను కలిసిన ఊరుమడ్ల గ్రామ నాయకులు thumb దుర్గానగర్ కాలనీలో ఘనంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు thumb దోర్నాల మండలానికి అందించిన సేవలు అభినందనీయం. thumb గ్రేటర్ నోయిడాలో ఘోర ప్రమాదం.. స్లీపర్ బస్సులో మంటలు.. thumb సంగారెడ్డి జిల్లాలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ పర్యటన thumb వాడపల్లి ఆలయంలో అభివృద్ధి పనులు ప్రారంభం thumb ర్యాలీ గ్రామంలో రూ.3.20 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం thumb దుర్గానగర్ కాలనీలో ఘనంగా గణేష్ నవరాత్రి సాంస్కృతిక వేడుకలు thumb మైలేజ్ కోసం కాదు.. ప్రజల కోసం పని చేయాలి thumb మూలపేటలో ఘనంగా శ్రీ గంగాలమ్మ తల్లి పండగకు ఏర్పాట్లు thumb ఎమ్మెల్యే వేముల వీరేశంను కలిసిన ఊరుమడ్ల గ్రామ నాయకులు thumb దుర్గానగర్ కాలనీలో ఘనంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు thumb దోర్నాల మండలానికి అందించిన సేవలు అభినందనీయం. thumb గ్రేటర్ నోయిడాలో ఘోర ప్రమాదం.. స్లీపర్ బస్సులో మంటలు.. thumb సంగారెడ్డి జిల్లాలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ పర్యటన thumb వాడపల్లి ఆలయంలో అభివృద్ధి పనులు ప్రారంభం thumb ర్యాలీ గ్రామంలో రూ.3.20 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం thumb దుర్గానగర్ కాలనీలో ఘనంగా గణేష్ నవరాత్రి సాంస్కృతిక వేడుకలు
Date of Publish : 10 August 2026, 05:19 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

వైసీపీ ర్యాలీకి భారీగా తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
10 Aug, 2026 - 05:19 PM
93 వీక్షణలు

వైసీపీ ర్యాలీకి భారీగా తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు

తిరువూరు: కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తిరువూరులో సోమవారం భారీ ర్యాలీ నిర్వహించారు. వైసీపీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి పిలుపు మేరకు మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాస్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

మధిర రోడ్డు నుంచి ప్రారంభమైన ర్యాలీ ప్రధాన వీధుల మీదుగా కొనసాగింది. వైసీపీ జెండాలు చేతబూనిన నాయకులు, కార్యకర్తలు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ముందుకు సాగారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు. ర్యాలీ సందర్భంగా పట్టణంలో రాజకీయ సందడి నెలకొంది.

ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాస్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగడం లేదని ఆరోపించారు. ముఖ్యంగా విద్యార్థులు, నిరుద్యోగ యువత సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.

ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరారు. నిరుద్యోగ యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని, ఉపాధి అవకాశాలను పెంచేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు.

ప్రజా సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకుండా కాలయాపన చేస్తే వైసీపీ చూస్తూ ఊరుకోదని స్వామిదాస్ స్పష్టం చేశారు. ప్రజల తరఫున మరింత ఉధృతంగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ప్రజలకు న్యాయం జరిగే వరకు వైసీపీ పోరాటం కొనసాగుతుందని తెలిపారు. కూటమి ప్రభుత్వ విధానాలు, హామీల అమలులో వైఫల్యాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని అన్నారు.

ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడటమే వైసీపీ లక్ష్యమని పేర్కొన్న స్వామిదాస్.. విద్యార్థులు, నిరుద్యోగులు, సామాన్య ప్రజల సమస్యల పరిష్కారం కోసం పార్టీ శ్రేణులు ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.

ర్యాలీలో వైసీపీ నాయకులు, మండల, పట్టణ స్థాయి నాయకులు, యువజన విభాగం నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భారీగా నాయకులు, కార్యకర్తలు తరలిరావడంతో ర్యాలీ ఉత్సాహంగా సాగింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో తిరువూరు ప్రధాన రహదారులు మార్మోగాయి.