వెంకట్రావుపేటలో మాల మహానాడు నూతన కమిటీ ఏర్పాటు
తెలంగాణ
/
మంచిర్యాల
/
లక్సెట్టిపేట
లక్షెట్టిపేట, సెప్టెంబర్ 10: మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం వెంకట్రావుపేట గ్రామంలో మాల మహానాడు సంఘం నూతన కమిటీని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సంఘం గ్రామ అధ్యక్షుడిగా కాపిరపు రాజారావు, ఉపాధ్యక్షుడిగా కొండ చరణ్‌ను సభ్యులు ఏకగ్రీవంగా ఎంపిక చేశారు.
నూతనంగా ఎంపికైన అధ్యక్షుడు, ఉపాధ్యక్షులకు సంఘం సభ్యులు, గ్రామస్తులు అభినందనలు తెలిపారు. సంఘాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు సామాజిక అభివృద్ధికి కృషి చేస్తామని నూతన కమిటీ సభ్యులు తెలిపారు.
గ్రామ ప్రజలకు ఎదురయ్యే సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని వారు పేర్కొన్నారు. సంఘ సభ్యులందరినీ సమన్వయం చేసుకుంటూ సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలిపారు.