BREAKING
thumb ● బంగారంలో ‘రీనియం’ కల్తీ కలకలం.. హాల్‌మార్క్ పరీక్షల్లోనూ బయటపడని వైనం thumb ● ఆటోలోనే బిడ్డకు ఊయల.. తండ్రి ప్రేమకు హృదయాన్ని హత్తుకునే నిదర్శనం! thumb ● చిట్యాల వద్ద మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి వాహనం అడ్డగింత thumb ● పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న మెదక్ ఎంపీ రఘునందన్ రావు thumb ● కోతులనడుమ గ్రామంలో రూ.2 కోట్లతో శ్రీ పశుపతినాథ్ ఆలయ నిర్మాణానికి సంకల్పం thumb ● ఆళ్లగడ్డ మున్సిపల్ చైర్మన్‌గా నేడు షేక్ అనీషా ప్రమాణ స్వీకారం thumb ● డంప్ యార్డ్ పొగతో శోభ కాలనీ వాసుల అవస్థలు thumb ● చాగలమర్రిలో పోలీసుల తీరుపై మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం thumb ● చాగలమర్రిలో రాజకీయ ఉద్రిక్తత.. thumb ● చాగలమర్రిలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడి.. ఏడుగురికి గాయాలు thumb ● బంగారంలో ‘రీనియం’ కల్తీ కలకలం.. హాల్‌మార్క్ పరీక్షల్లోనూ బయటపడని వైనం thumb ● ఆటోలోనే బిడ్డకు ఊయల.. తండ్రి ప్రేమకు హృదయాన్ని హత్తుకునే నిదర్శనం! thumb ● చిట్యాల వద్ద మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి వాహనం అడ్డగింత thumb ● పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న మెదక్ ఎంపీ రఘునందన్ రావు thumb ● కోతులనడుమ గ్రామంలో రూ.2 కోట్లతో శ్రీ పశుపతినాథ్ ఆలయ నిర్మాణానికి సంకల్పం thumb ● ఆళ్లగడ్డ మున్సిపల్ చైర్మన్‌గా నేడు షేక్ అనీషా ప్రమాణ స్వీకారం thumb ● డంప్ యార్డ్ పొగతో శోభ కాలనీ వాసుల అవస్థలు thumb ● చాగలమర్రిలో పోలీసుల తీరుపై మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం thumb ● చాగలమర్రిలో రాజకీయ ఉద్రిక్తత.. thumb ● చాగలమర్రిలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడి.. ఏడుగురికి గాయాలు
Test 4
Date of Publish : 23 November 2026, 04:13 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

విదేశాల్లో ఏఐ డేటా కేంద్రాలు నిర్మిస్తే భారీ జరిమానాలు అమెరికా టెక్ కంపెనీలకు ట్రంప్ హెచ్చరిక..

అంతర్జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Nov, 2026 - 04:13 PM
12 వీక్షణలు

స్వదేశంలోనే నిర్మించాలని స్పష్టీకరణ వాషింగ్టన్: అమెరికాకు చెందిన సాంకేతిక సంస్థలు విదేశాల్లో కృత్రిమ మేధ (ఏఐ) డేటా కేంద్రాలను నిర్మిస్తే భారీ జరిమానాలు, పన్నులు విధిస్తామని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. అమెరికా కంపెనీలు ఇతర దేశాల్లో డేటా కేంద్రాలను ఏర్పాటు చేయడానికి తమ ప్రభుత్వం అనుమతించబోదని స్పష్టం చేశారు. ఆసియా పర్యటన ముగించుకుని తిరిగి వచ్చిన అనంతరం విలేకరులతో మాట్లాడిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. విదేశాల్లో నిర్మించే డేటా కేంద్రాలను భవిష్యత్తులో చైనా స్వాధీనం చేసుకునే ప్రమాదం ఉందని ట్రంప్ అభిప్రాయపడ్డారు. గతంలో సెమీ కండక్టర్ చిప్‌లు, ఇతర సాంకేతిక పరిజ్ఞానాలను విదేశాలకు అనుమతించడం వల్ల అమెరికా నష్టపోయిందని పేర్కొన్నారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని కీలక సాంకేతిక మౌలిక సదుపాయాలను అమెరికాలోనే అభివృద్ధి చేయాలని టెక్ సంస్థలకు సూచించారు. గూగుల్, మెటా వంటి ప్రముఖ అమెరికా సాంకేతిక సంస్థలు ఇప్పటికే విదేశాల్లో డేటా కేంద్రాల నిర్మాణానికి ఒప్పందాలు చేసుకున్న నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మరోవైపు అమెరికాలో డేటా కేంద్రాల ఏర్పాటుతో విద్యుత్ వినియోగం పెరిగి బిల్లుల భారం అధికమవుతోందని, పర్యావరణంపై ప్రభావం పడుతోందని స్థానిక ప్రజలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. డేటా కేంద్రాల నిర్మాణానికి ముందుకు వచ్చే సంస్థలకు స్థానికులు సహకరించాలని, ప్రతిఫలంగా సమాజ అభివృద్ధికి నిధులు, రాయితీలు పొందేలా చూడాలని ట్రంప్ సూచించారు.