BREAKING
మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శక్తి యాప్ పై అవగహన సదస్సు పేపర్ ప్లేట్ల వాడకంని నిషేధించాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్. సంగారెడ్డి: అధ్యాపక పోస్టులకు దరఖాస్తు రేపే ఆఖరి తేదీ! మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శక్తి యాప్ పై అవగహన సదస్సు పేపర్ ప్లేట్ల వాడకంని నిషేధించాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్. సంగారెడ్డి: అధ్యాపక పోస్టులకు దరఖాస్తు రేపే ఆఖరి తేదీ!
www.ntodaynews.com

విద్యుత్ శాఖలో కొలువుల జాతర.. 629 ఏఈఈ పోస్టులకు భారీ పోటీ 1.05 లక్షల మంది అభ్యర్థుల భవితవ్య పరీక్ష.. 23 నుంచి 27 వరకు నియామక సమరం

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
21 Aug, 2026 - 07:59 PM
21 వీక్షణలు

629 ఏఈఈ పోస్టులకు 1.05 లక్షల మంది పోటీ.. 23 నుంచి విద్యుత్ సంస్థల నియామక పరీక్షలు

ఐదు రోజుల పాటు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు.. 94 పరీక్షా కేంద్రాల్లో కట్టుదిట్టమైన ఏర్పాట్లు

తిరుపతి, ఆగస్టు 21: రాష్ట్ర విద్యుత్ సంస్థల్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఏఈఈ) పోస్టుల భర్తీకి నిర్వహించే నియామక పరీక్షలకు ఏర్పాట్లు పూర్తయ్యాయని ఏపీఎస్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ లోతేటి తెలిపారు. ఈ నెల 23 నుంచి 27 వరకు ఐదు రోజుల పాటు కంప్యూటర్ ఆధారిత విధానంలో పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

ఏపీ ట్రాన్స్‌కో, ఏపీ జెన్కో, ఏపీఎస్పీడీసీఎల్, ఏపీఈపీడీసీఎల్, ఏపీసీపీడీసీఎల్ సంస్థల్లో మొత్తం 629 ఏఈఈ పోస్టుల భర్తీ కోసం నిర్వహిస్తున్న ఈ పరీక్షకు 1,05,566 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో 81, ఇతర రాష్ట్రాల్లో 13 కలిపి మొత్తం 94 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు.

విద్యుత్ సంస్థల్లో 629 పోస్టులు

మొత్తం పోస్టుల్లో ఏపీ ట్రాన్స్‌కోలో 200, ఏపీఈపీడీసీఎల్‌లో 135, ఏపీఎస్పీడీసీఎల్‌లో 134, ఏపీ జెన్కోలో 100, ఏపీసీపీడీసీఎల్‌లో 60 పోస్టులు ఉన్నాయని తెలిపారు. ఎంపికైన అభ్యర్థులకు ప్రొబేషన్ కాలంలో నెలకు రూ.75 వేల కన్సాలిడేటెడ్ వేతనం చెల్లిస్తామని, అనంతరం నిబంధనల ప్రకారం రెగ్యులర్ పే స్కేల్ వర్తిస్తుందని పేర్కొన్నారు.

విభాగాల వారీగా పరీక్షలు

ఆగస్టు 23న సివిల్ ఇంజినీరింగ్ పరీక్షకు 16,183 మంది, ఆగస్టు 24న మెకానికల్ ఇంజినీరింగ్ పరీక్షకు 9,444 మంది హాజరుకానున్నారు. ఆగస్టు 25న టెలికాం, ఎలక్ట్రానిక్స్ విభాగాలకు 26,237 మంది పరీక్ష రాయనున్నారు. అత్యధికంగా ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ పరీక్షకు ఆగస్టు 26, 27 తేదీల్లో 53,702 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు.

ప్రతి పరీక్ష ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు రెండు విడతల్లో నిర్వహించనున్నారు. ఉదయం పరీక్షకు అభ్యర్థులు 7.30 గంటలకు, మధ్యాహ్నం పరీక్షకు 1 గంటకు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు.

సాంకేతిక భద్రతతో పరీక్ష నిర్వహణ

పరీక్షలను పారదర్శకంగా నిర్వహించేందుకు బయోమెట్రిక్ ధ్రువీకరణ, సీసీ కెమెరాల పర్యవేక్షణ, కేంద్రస్థాయి పర్యవేక్షణ వ్యవస్థలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రశ్నపత్రాల భద్రత కోసం ఎన్క్రిప్టెడ్ విధానం అమలు చేస్తున్నామని, మొబైల్ జామర్లను కూడా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

అభ్యర్థుల ప్రవేశ సమయంలో వేలిముద్రలు, ఫొటో క్యాప్చర్, గుర్తింపు కార్డుల పరిశీలన నిర్వహిస్తామని తెలిపారు. ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు, మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచీలు, కాలిక్యులేటర్లు, ఇయర్‌ఫోన్లు పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించబోమని స్పష్టం చేశారు.

పరీక్ష అనంతరం వేగంగా నియామక ప్రక్రియ

పరీక్ష పూర్తైన మూడు రోజుల్లో ప్రిలిమినరీ ఆన్సర్ కీ విడుదల చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. అనంతరం ఏడు రోజుల పాటు అభ్యంతరాలు స్వీకరించి నిపుణుల కమిటీ పరిశీలన తర్వాత తుది ఆన్సర్ కీ, నార్మలైజ్డ్ స్కోర్లు, మెరిట్ జాబితాను సెప్టెంబర్ చివరి వారంలో విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.

తుది ఎంపిక ప్రక్రియ మెరిట్, రిజర్వేషన్ నిబంధనలు, అభ్యర్థుల ప్రాధాన్యత ఆధారంగా జరుగుతుందని తెలిపారు. అభ్యర్థులు అధికారిక రిక్రూట్‌మెంట్ పోర్టల్‌లోని సమాచారాన్ని మాత్రమే నమ్మాలని, పుకార్లు, అనధికార సమాచారాన్ని విశ్వసించవద్దని సూచించారు.