BREAKING
thumb ● ఆళ్లగడ్డ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● సరస్వతి దేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ తల్లి thumb ● శ్రీ బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రా లు సమర్పించిన పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు! thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ thumb ● రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● మహేశ్వరి దేవి అలంకరణలో దర్శనమిచ్చిన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు thumb ● డిండి ఎత్తిపోతల పథకానికి అడ్డంకులు సృష్టించవద్దు thumb ● పులివెందులలో ఊపందుకున్న మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ thumb ● ఆళ్లగడ్డ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● సరస్వతి దేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ తల్లి thumb ● శ్రీ బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రా లు సమర్పించిన పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు! thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ thumb ● రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● మహేశ్వరి దేవి అలంకరణలో దర్శనమిచ్చిన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు thumb ● డిండి ఎత్తిపోతల పథకానికి అడ్డంకులు సృష్టించవద్దు thumb ● పులివెందులలో ఊపందుకున్న మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ
Date of Publish : 03 September 2026, 06:30 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

విజయవాడ: టీడీపీని 9 నెలల్లో అధికారంలోకి తీసుకురావడంలో హరికృష్ణ సేవలు మరువలేనివి

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
03 Sep, 2026 - 06:30 AM
69 వీక్షణలు

చైతన్య రథ సారథిగా ఎన్టీఆర్‌కు వెన్నంటే నిలిచిన హరికృష్ణ

విజయవాడ: స్వర్గీయ నందమూరి హరికృష్ణ జయంతి సందర్భంగా విజయవాడ ఎంపీ కార్యాలయంలో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ వర్ల రామయ్య, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ పాల్గొన్నారు. హరికృష్ణ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ చిత్రపటాల ఫొటో ప్రదర్శనను ఇరువురు నేతలు కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా కేశినేని శివనాథ్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ విజయానికి స్వర్గీయ నందమూరి హరికృష్ణ కీలక పాత్ర పోషించారని తెలిపారు. నందమూరి కుటుంబానికి, తెలుగుదేశం పార్టీకి హరికృష్ణ అందించిన సేవలు ఎప్పటికీ మరువలేనివని పేర్కొన్నారు.

ఎన్టీఆర్‌కు వెన్నంటే నిలిచిన హరికృష్ణ

స్వర్గీయ నందమూరి హరికృష్ణ తన తండ్రి నందమూరి తారక రామారావుకు ఎల్లప్పుడూ వెన్నంటే నిలిచారని కేశినేని శివనాథ్ అన్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ సమయంలో ఎన్టీఆర్ చేపట్టిన రాజకీయ యాత్రలో చైతన్య రథ సారథిగా హరికృష్ణ కీలక బాధ్యతలు నిర్వర్తించారని తెలిపారు.

చైతన్య రథంపై ఎన్టీఆర్ రాష్ట్రవ్యాప్తంగా పర్యటించిన సమయంలో హరికృష్ణ ఎంతో అంకితభావంతో పనిచేశారని, తండ్రి రాజకీయ లక్ష్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో తనవంతు పాత్ర పోషించారని అన్నారు. ఎన్టీఆర్ నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ కేవలం తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి రావడంలో హరికృష్ణ చేసిన కృషి ప్రత్యేకంగా గుర్తుండిపోతుందని పేర్కొన్నారు.

పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఎన్టీఆర్ చేసిన పర్యటనల్లో చైతన్య రథం ఒక చారిత్రాత్మక ఘట్టంగా నిలిచిందని, ఆ రథానికి సారథిగా హరికృష్ణ అందించిన సేవలు తెలుగుదేశం పార్టీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాయని అన్నారు.

పార్టీకి హరికృష్ణ సేవలు చిరస్మరణీయం

తెలుగుదేశం పార్టీ కోసం, నందమూరి కుటుంబం కోసం హరికృష్ణ చేసిన సేవలు, ఆయన చూపిన అంకితభావం పార్టీ శ్రేణులకు ఎప్పటికీ స్ఫూర్తిదాయకమని కేశినేని శివనాథ్ పేర్కొన్నారు. హరికృష్ణ ఆశయాలను, ఆయన సేవలను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ వర్ల రామయ్య, పార్టీ నాయకులు, కార్యకర్తలు, నందమూరి అభిమానులు హరికృష్ణకు ఘనంగా నివాళులర్పించారు.