BREAKING
thumb ● ఆళ్లగడ్డ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● సరస్వతి దేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ తల్లి thumb ● శ్రీ బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రా లు సమర్పించిన పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు! thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ thumb ● రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● మహేశ్వరి దేవి అలంకరణలో దర్శనమిచ్చిన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు thumb ● డిండి ఎత్తిపోతల పథకానికి అడ్డంకులు సృష్టించవద్దు thumb ● పులివెందులలో ఊపందుకున్న మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ thumb ● ఆళ్లగడ్డ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● సరస్వతి దేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ తల్లి thumb ● శ్రీ బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రా లు సమర్పించిన పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు! thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ thumb ● రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● మహేశ్వరి దేవి అలంకరణలో దర్శనమిచ్చిన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు thumb ● డిండి ఎత్తిపోతల పథకానికి అడ్డంకులు సృష్టించవద్దు thumb ● పులివెందులలో ఊపందుకున్న మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ
Date of Publish : 03 September 2026, 05:13 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

కాలుతున్న శవాల నుంచి మాంసం తిన్నాడంటూ వీడియో.. ‘అఘోర’ నందగిరి అరెస్ట్

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
03 Sep, 2026 - 05:13 AM
141 వీక్షణలు

ఉజ్జయిని: తనను తాను అఘోరగా చెప్పుకుంటూ, అఘోర ముసుగులో వికృత చర్యలకు పాల్పడుతున్నాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న కాళీ అలియాస్ నందగిరిని ఉజ్జయిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు కేసుల్లో అరెస్టయిన నందగిరి.. ‘కిన్నెర అఖాడా మహామండలేశ్వర్’గా కూడా ప్రచారం చేసుకుంటున్నట్లు సమాచారం.

ఉజ్జయినిలోని చక్రతీర్థ స్మశానవాటికలో మంగళవారం రాత్రి అనుమతి లేకుండా ప్రవేశించిన నందగిరి.. అక్కడ కాలుతున్న శవం నుంచి మాంసాన్ని కట్ చేసి తిన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనను వీడియోగా చిత్రీకరించి సామాజిక మాధ్యమంలో ప్రచురించినట్లు తెలుస్తోంది.

ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో స్మశానవాటిక కమిటీ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు నందగిరిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం రిమాండ్ విధించింది.

వికృత చర్యలను ఖండించిన మహామండలేశ్వర్

నందగిరి వ్యవహారంపై మహామండలేశ్వర్ శైలేశ్వరానందగిరి తీవ్రంగా స్పందించారు. ఇలాంటి వికృత చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. నందగిరి వంటి వ్యక్తులను సభ్య సమాజానికి దూరంగా ఉంచాలని, కేవలం ప్రచారం కోసం ఇలాంటి నీచమైన చర్యలకు పాల్పడటం సరికాదని అన్నారు.