BREAKING
thumb ● ఆళ్లగడ్డ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● సరస్వతి దేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ తల్లి thumb ● శ్రీ బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రా లు సమర్పించిన పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు! thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ thumb ● రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● మహేశ్వరి దేవి అలంకరణలో దర్శనమిచ్చిన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు thumb ● డిండి ఎత్తిపోతల పథకానికి అడ్డంకులు సృష్టించవద్దు thumb ● పులివెందులలో ఊపందుకున్న మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ thumb ● ఆళ్లగడ్డ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● సరస్వతి దేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ తల్లి thumb ● శ్రీ బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రా లు సమర్పించిన పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు! thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ thumb ● రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● మహేశ్వరి దేవి అలంకరణలో దర్శనమిచ్చిన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు thumb ● డిండి ఎత్తిపోతల పథకానికి అడ్డంకులు సృష్టించవద్దు thumb ● పులివెందులలో ఊపందుకున్న మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ
Date of Publish : 03 September 2026, 07:18 am
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

గ్రామాల్లో పల్లె నిద్ర కార్యక్రమం

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
03 Sep, 2026 - 07:18 AM
64 వీక్షణలు

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమాలు

మదనపల్లె | Ntoday News

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో శాంతిభద్రతలను కాపాడేందుకు అన్నమయ్య జిల్లా పోలీసులు ‘పల్లె నిద్ర’ కార్యక్రమాన్ని చేపట్టారు. జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి, ఐపీఎస్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పోలీసులు గ్రామాల్లో రాత్రి వేళల్లో బస చేస్తూ ప్రజలకు భద్రతపై భరోసా కల్పిస్తున్నారు.

ఈ సందర్భంగా మహిళల భద్రత, బాల్య వివాహాల నివారణ, సైబర్ నేరాలపై అప్రమత్తత, దొంగతనాల నివారణ తదితర అంశాలపై గ్రామస్తులకు పోలీసులు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు.

గ్రామాల్లో అనుమానాస్పద వ్యక్తుల సంచారం, అసాంఘిక కార్యకలాపాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. అసాంఘిక శక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కొత్తగా, అనుమానాస్పదంగా కనిపించే వ్యక్తులు గ్రామాల్లో సంచరిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా గ్రామాల్లో ప్రశాంత వాతావరణం నెలకొల్పడమే ‘పల్లె నిద్ర’ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని పోలీసులు తెలిపారు.