BREAKING
thumb ● ఆళ్లగడ్డ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● సరస్వతి దేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ తల్లి thumb ● శ్రీ బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రా లు సమర్పించిన పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు! thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ thumb ● రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● మహేశ్వరి దేవి అలంకరణలో దర్శనమిచ్చిన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు thumb ● డిండి ఎత్తిపోతల పథకానికి అడ్డంకులు సృష్టించవద్దు thumb ● పులివెందులలో ఊపందుకున్న మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ thumb ● ఆళ్లగడ్డ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● సరస్వతి దేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ తల్లి thumb ● శ్రీ బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రా లు సమర్పించిన పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు! thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ thumb ● రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● మహేశ్వరి దేవి అలంకరణలో దర్శనమిచ్చిన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు thumb ● డిండి ఎత్తిపోతల పథకానికి అడ్డంకులు సృష్టించవద్దు thumb ● పులివెందులలో ఊపందుకున్న మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ
Date of Publish : 03 September 2026, 06:30 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చనుబండలో పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
03 Sep, 2026 - 06:30 AM
85 వీక్షణలు

కూటమి నేతలంతా కలిసికట్టుగా పనిచేస్తేనే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయాలు సాధ్యం: మొండ్రు సురేష్

నూజవీడు నియోజకవర్గం, చాట్రాయి మండలం, చనుబండ:

జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను చనుబండ పంచాయతీ పరిధిలో మొండ్రు సురేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. చనుబండ సెంటర్‌లో కేక్ కట్ చేసి పవన్ కళ్యాణ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మొండ్రు సురేష్ మాట్లాడుతూ సమాజ శ్రేయస్సే ధ్యేయంగా, నిరుపేదల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న పవన్ కళ్యాణ్ ఆశయాల బాటలో తామంతా పయనిస్తామని తెలిపారు. పవన్ కళ్యాణ్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, సంతోషంగా ఉండాలని, ప్రజలకు మరింత సేవ చేసే శక్తిని భగవంతుడు ప్రసాదించాలని ఆకాంక్షించారు.

అదేవిధంగా కూటమి ప్రభుత్వం విజయవంతంగా ముందుకు సాగాలంటే అన్ని పార్టీల నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుకున్న స్థాయిలో విజయాలు సాధించాలంటే కూటమి శ్రేణులంతా ఐక్యంగా పనిచేయాలని సూచించారు. సమన్వయం లేకుండా ఎవరికి వారు వ్యవహరిస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమికి నష్టం కలిగే పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉందని మొండ్రు సురేష్ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు విస్సంపల్లి రాజా, బొజ్జూరి గోపి, మేడ చింటూ, రత్నా రాజు, దేశిన సాయి, ఎస్‌కే రియాజ్, అడిమెల్లి ప్రసాద్, మిద్దె కిట్టితో పాటు పార్టీ కార్యకర్తలు, అభిమానులు, స్థానిక ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.