BREAKING
thumb ● కడప-రేణిగుంట హైవే పనులు వేగవంతం.. thumb ● పిన్నపురం సమీపంలో చిరుత కలకలం.. పాతపాయ కొండపై సంచారం thumb ● విద్యార్థులు ప్రయోగాలు, అన్వేషణతో జ్ఞానాన్ని విస్తరించుకోవాలి thumb ● భూ సమస్యల పరిష్కారానికి గ్రామసభలు నిర్వహించాలి thumb ● రామన్నపేట ఎంఈఓ తంగేళ్ల సురేందర్ రెడ్డి కి అరుదైన గౌరవం thumb ● ఓటు చోరీ ఆరోపణలపై డీవైఎఫ్‌ఐ నిరసన thumb ● తుంగతుర్తిలో పోషణ మాసం ఉత్సవాలు ప్రారంభం thumb ● ఆర్టీసీ కార్మికుల పోరాటం మరువలేనిది thumb ● రామన్నపేట పీహెచ్‌సీలో వైద్య సేవలు మెరుగుపర్చాలని టీడీపీ వినతి thumb ● యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో జ్ఞానేష్ కుమార్ దిష్టిబొమ్మ దగ్ధం thumb ● కడప-రేణిగుంట హైవే పనులు వేగవంతం.. thumb ● పిన్నపురం సమీపంలో చిరుత కలకలం.. పాతపాయ కొండపై సంచారం thumb ● విద్యార్థులు ప్రయోగాలు, అన్వేషణతో జ్ఞానాన్ని విస్తరించుకోవాలి thumb ● భూ సమస్యల పరిష్కారానికి గ్రామసభలు నిర్వహించాలి thumb ● రామన్నపేట ఎంఈఓ తంగేళ్ల సురేందర్ రెడ్డి కి అరుదైన గౌరవం thumb ● ఓటు చోరీ ఆరోపణలపై డీవైఎఫ్‌ఐ నిరసన thumb ● తుంగతుర్తిలో పోషణ మాసం ఉత్సవాలు ప్రారంభం thumb ● ఆర్టీసీ కార్మికుల పోరాటం మరువలేనిది thumb ● రామన్నపేట పీహెచ్‌సీలో వైద్య సేవలు మెరుగుపర్చాలని టీడీపీ వినతి thumb ● యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో జ్ఞానేష్ కుమార్ దిష్టిబొమ్మ దగ్ధం
Date of Publish : 22 August 2026, 07:00 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

విస్సన్నపేటలో ఉపాధ్యాయుల తొలి కాంప్లెక్స్ సమావేశాలు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
22 Aug, 2026 - 07:00 PM
63 వీక్షణలు

విస్సన్నపేటలో ఉపాధ్యాయుల తొలి కాంప్లెక్స్ సమావేశాలు

బోధనా సామర్థ్యాల పెంపుపై ఉపాధ్యాయులకు సూచనలు

విస్సన్నపేట, ఆగస్టు 22: మండలంలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు తొలి కాంప్లెక్స్ సమావేశాలు శనివారం నిర్వహించారు. ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులతో పాటు గణితం, భౌతిక శాస్త్రం, జీవశాస్త్రం, సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులకు సబ్జెక్ట్ కాంప్లెక్స్ సమావేశాలు ఏర్పాటు చేశారు.

ప్రాథమిక పాఠశాలలకు చెందిన 51 మంది ఉపాధ్యాయులు ఈ సమావేశాల్లో పాల్గొన్నారు. సబ్జెక్ట్ కాంప్లెక్స్‌లో భాగంగా రెడ్డిగూడెం, విస్సన్నపేట మండలాలకు చెందిన 16 మంది భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులు, 24 మంది జీవశాస్త్ర ఉపాధ్యాయులతో పాటు గణితం, సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు రెడ్డిగూడెం సబ్జెక్ట్ కాంప్లెక్స్ సమావేశాలకు హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఉపాధ్యాయుల బోధనా నైపుణ్యాల అభివృద్ధి, విద్యార్థుల అభ్యసన సామర్థ్యాల మెరుగుదల, విద్యా సంబంధిత అంశాలు, కాంప్లెక్స్ సమావేశాల నిర్వహణ విధానాలపై చర్చించారు. విద్యార్థులకు మెరుగైన బోధన అందించేలా అవసరమైన సూచనలు చేశారు.

కార్యక్రమంలో కాంప్లెక్స్ చైర్మన్ ఆర్. శోభారాణి, మండల విద్యాశాఖ అధికారి–1 కే. శంకరరావు, మండల విద్యాశాఖ అధికారి–2 ఈ. సుధాకర్, సబ్జెక్ట్ రిసోర్స్ పర్సన్స్, సీఆర్పీలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.