బోండా ఉమాను నిలదీసిన విజయవాడ ప్రజలు..
బోండా ఉమాను నిలదీసిన విజయవాడ ప్రజలు.. సమస్యలు పరిష్కరించాలంటూ మహిళ ఆవేదన
విజయవాడలో టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావుకు స్థానిక ప్రజల నుంచి సమస్యలపై ప్రశ్నలు ఎదురయ్యాయి. వరదల సమయంలో తమను పట్టించుకోలేదని, సమస్యలతో ఇబ్బందులు పడుతున్నప్పటికీ తమ పరిస్థితిని ఎవరూ పట్టించుకోవడం లేదని ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం కూడా పలుమార్లు విజ్ఞప్తి చేసిన తర్వాతే ఎమ్మెల్యే తమ ప్రాంతానికి వచ్చారని ఆమె పేర్కొన్నారు.
వర్షాలు కురిసిన ప్రతిసారీ తమ ఇళ్లలోకి నీరు వస్తోందని, రహదారి నిర్మించాలని స్థానికులు ఎమ్మెల్యేను కోరారు. దీనికి స్పందించిన బోండా ఉమా రోడ్డు వేయిస్తానని హామీ ఇచ్చారు. అయితే రోడ్డు సమస్యను ప్రస్తావించిన ప్రతిసారీ ఇదే సమాధానం చెబుతున్నారని ఓ మహిళ అసంతృప్తి వ్యక్తం చేశారు. సమస్యను హామీతో కాకుండా శాశ్వతంగా పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.