20 రోజులుగా కొనసాగుతున్న వీఆర్ఏల ధర్నా
ఆంధ్రప్రదేశ్
/
ఏలూరు
ప్రభుత్వం నుంచి స్పందన లేదని వీఆర్ఏల సంఘం ఆరోపణ
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండల తహశీల్దార్ కార్యాలయం వద్ద వీఆర్ఏలు చేపట్టిన ధర్నా సోమవారానికి 20వ రోజుకు చేరుకుంది. తమ సమస్యల పరిష్కారం కోసం 20 రోజులుగా ఆందోళన కొనసాగిస్తున్నప్పటికీ ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎటువంటి స్పందన రాలేదని వీఆర్ఏల యూనియన్ సంఘం నూజివీడు డివిజన్ అధ్యక్షుడు షేక్ సైదులు ఆరోపించారు.
తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు నిరసన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామని తెలిపారు. వీఆర్ఏల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించి, తమ డిమాండ్లపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు. ప్రభుత్వం స్పందించే వరకు ఆందోళన కొనసాగిస్తామని సైదులు తెలిపారు.