ఇచ్చిన అభివృద్ధి హామీలు అమలు చేయకపోతే రాజీనామా చేయడానికి సిద్దామని సవాల్ విసిరిన మంత్రి అడ్లూరి
NTODAY NEWS: కరీంనగర్
కరీంనగర్‌లో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రెస్ మీట్
కరీంనగర్ ఆర్అండ్ బి అతిథిగృహంలో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డితో కలిసి పత్రిక విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ…
నా నియోజకవర్గం పూర్తిగా రైతు ఆధారిత ప్రాంతమని, ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలనే ఉద్దేశంతో కరీంనగర్‌లో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 2016లో జీవో నం.71 ప్రకారం ప్రారంభించిన ప్రాజెక్టును 2022 వరకు పూర్తి చేయలేదని, అంచనాలను రూ.136 కోట్లకు పెంచారని విమర్శించారు. ఎలాంటి అనుమతులు లేకుండా అప్పటి కాంట్రాక్టర్‌తో చీకటి ఒప్పందాలు చేసి పనులు ప్రారంభించారని ఆరోపించారు. కాళేశ్వరం లింక్–2 పేరుతో 1,020 ఎకరాల భూమిని బలవంతంగా స్వాధీనం చేసుకున్నారని, ధర్మపురి నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తామని నాటి సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనలు అమలుకాలేదన్నారు. అప్పటి మంత్రులు 146 గ్రామాలకు సాగునీటి గురించి ఒక్కసారి కూడా ప్రశ్నించలేదని తెలిపారు. కాళేశ్వరం పేరుతో ఒడ్డెర జాతి ప్రజలను పోలీసులతో బెదిరించి గుట్టను ఖాళీ చేయించారని, భూములు ఇవ్వకపోతే కేసులు పెడతామని రైతులను బెదిరించారని ఆరోపించారు. ప్రజలను మోసం చేయడం తనకు తెలియదని, నిజాలు మాత్రమే మాట్లాడుతున్నానని స్పష్టం చేశారు. తాను కేవలం ఆరు నెలలుగా మంత్రిగా ఉన్నప్పటికీ, 80 మంది విద్యార్థులను పొలాస అగ్రికల్చర్ కాలేజీకి పంపించి రూ.7 కోట్ల బకాయిలను ముఖ్యమంత్రి నాయకత్వంలో చెల్లించామని తెలిపారు. జిల్లాకు చెందిన ఎస్సీ మంత్రిగా దళిత బిడ్డలను గత పాలకులు విస్మరించారని విమర్శించారు. తన రాజీనామాపై మాట్లాడే వారికి సమాధానంగా— “నేను రాజీనామా చేయాలా వద్దా అనేది ధర్మపురి నియోజకవర్గ ప్రజలే నిర్ణయిస్తారు” అని స్పష్టం చేశారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు నూటికి నూరు శాతం కట్టుబడి ఉంటానని తెలిపారు.
గత ప్రభుత్వ అప్పుల వల్ల రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో పడిందని, ప్రస్తుతం మా పాలనలో ఉద్యోగులకు ప్రతి నెల 1వ తేదీన జీతాలు చెల్లిస్తున్నామని చెప్పారు. ధర్మపురి నియోజకవర్గ అభివృద్ధి కోసం పాలిటెక్నిక్ కళాశాల, రెవెన్యూ డివిజన్, బస్ డిపో తీసుకువస్తానని హామీ ఇచ్చారు. ట్రైబల్ మినిస్టర్ ద్వారా రూ.60 కోట్ల అభివృద్ధి నిధులు తీసుకువచ్చామని, వాడ–వాడ అభివృద్ధికి రూ.3 కోట్లు కేటాయించామని తెలిపారు. మరో మూడు సంవత్సరాల్లో తాను ఇచ్చిన అభివృద్ధి హామీలు అమలు చేయకపోతే రాజీనామా చేయడానికి సిద్ధమని స్పష్టమైన సవాల్ విసిరారు. మూడు సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి ఆధారంగానే ప్రజల ముందుకు వెళ్లి ఓటు అడుగుతానన్నారు. జనవరి చివరి వారం వరకు గోదావరి పుష్కరాలకు సంబంధించి స్పష్టమైన ప్రణాళికతో నిధులు వెచ్చించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామని తెలిపారు. తొమ్మిదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ధర్మపురికి కనీస మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేదని విమర్శించారు.
Follow us on
Website
Facebook
Instagram
YouTube