BREAKING
thumb ● నారాయణ విద్యాసంస్థల ఖమ్మం జోన్ నారాయణ ప్రీమియర్ లీగ్ పోటీలు thumb ● లింబాద్రి గుట్టకు అయ్యప్ప స్వాముల పాదయాత్ర thumb ● రిజిస్ట్రేషన్ ఫార్మసిస్ట్ లేకుండా మెడికల్ షాపుల నిర్వహణపై చర్యలు తీసుకోవాలి thumb ● హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. కారు ఢీకొని ఆటో ప్రయాణికురాలు మృతి thumb ● గ్రామీణ వైద్యులపై దాడులు నిలిపివేయాలి thumb ● ఫతేపూర్ గ్రామంలో ఘనంగా జవహర్‌లాల్ నెహ్రూ జయంతి వేడుకలు thumb ● బాలల హృదయాల్లో శాస్త్రీయ విజ్ఞానం, దేశభక్తిని నింపిన మహానేత జవహర్‌లాల్ నెహ్రూ thumb ● అయ్యప్ప మాలధారణ స్వీకరించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి thumb ● పంచాయతీ ఎన్నికల్లోనూ కూటమి అభ్యర్థులదే విజయం: ఎమ్మెల్యే బండారు సత్యానందరావు thumb ● సర్పంచ్ ఎన్నికల్లో చిలువూరి రామకృష్ణంరాజు విజయానికి కృషి చేయాలి thumb ● నారాయణ విద్యాసంస్థల ఖమ్మం జోన్ నారాయణ ప్రీమియర్ లీగ్ పోటీలు thumb ● లింబాద్రి గుట్టకు అయ్యప్ప స్వాముల పాదయాత్ర thumb ● రిజిస్ట్రేషన్ ఫార్మసిస్ట్ లేకుండా మెడికల్ షాపుల నిర్వహణపై చర్యలు తీసుకోవాలి thumb ● హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. కారు ఢీకొని ఆటో ప్రయాణికురాలు మృతి thumb ● గ్రామీణ వైద్యులపై దాడులు నిలిపివేయాలి thumb ● ఫతేపూర్ గ్రామంలో ఘనంగా జవహర్‌లాల్ నెహ్రూ జయంతి వేడుకలు thumb ● బాలల హృదయాల్లో శాస్త్రీయ విజ్ఞానం, దేశభక్తిని నింపిన మహానేత జవహర్‌లాల్ నెహ్రూ thumb ● అయ్యప్ప మాలధారణ స్వీకరించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి thumb ● పంచాయతీ ఎన్నికల్లోనూ కూటమి అభ్యర్థులదే విజయం: ఎమ్మెల్యే బండారు సత్యానందరావు thumb ● సర్పంచ్ ఎన్నికల్లో చిలువూరి రామకృష్ణంరాజు విజయానికి కృషి చేయాలి
Test 4
Date of Publish : 14 November 2026, 02:03 pm
Posted by : PAGADALA DEVAIAH

ప్రభాత్ నగర్ పార్కు సమస్యలను పరిష్కరిస్తాం: ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి

తెలంగాణ
/ రంగారెడ్డి
Reporter
Pagadala Devaiah Lb Nagar Constituency
14 Nov, 2026 - 02:03 PM
23 వీక్షణలు

పార్కులో గేటు ఏర్పాటు చేయకుండా ప్రత్యామ్నాయ స్థలంలో నిర్మాణానికి ప్రతిపాదన.. వాకింగ్ ట్రాక్ పునరుద్ధరణ, వాచ్‌మెన్‌కు కొత్త గది నిర్మించాలని అధికారులకు సూచన

ఎల్బీనగర్, నవంబర్ 14: చైతన్యపురి డివిజన్ పరిధిలోని ప్రభాత్ నగర్ పార్కులో నెలకొన్న సమస్యలను పరిశీలించి పరిష్కారానికి కృషి చేస్తానని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి హామీ ఇచ్చారు. పార్కు వినియోగానికి ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ స్థలంలో గేటు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు.

గత వారం రోజుల క్రితం ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి ప్రభాత్ నగర్ పార్కును సందర్శించిన సందర్భంగా స్థానిక వాకర్లు తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ఎన్నో సంవత్సరాలుగా ఈ పార్కులో ప్రతిరోజూ వాకింగ్ చేస్తున్నామని, వందలాది మంది స్థానికులు ఉదయం, సాయంత్రం వ్యాయామం కోసం ఈ పార్కుపైనే ఆధారపడుతున్నారని వివరించారు. పార్కు పక్కనే నిర్మాణంలో ఉన్న టీమ్స్ ఆసుపత్రి యాజమాన్యం పార్కు వద్ద గేటు ఏర్పాటు చేయనున్నట్లు తెలియడంతో ఆందోళన వ్యక్తం చేశారు. అక్కడ గేటు ఏర్పాటు చేస్తే వాకింగ్‌కు సరిపడా స్థలం ఉండదని, ఇప్పటికే వినియోగంలో ఉన్న పార్కును రెండు భాగాలుగా విభజించడం వల్ల స్థానికులకు ఇబ్బందులు ఎదురవుతాయని ఎమ్మెల్యేకు విన్నవించారు.

దీనిపై స్పందించిన ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ.. గతంలో టీమ్స్ ఆసుపత్రి శంకుస్థాపన కార్యక్రమం సందర్భంగా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి పోలీస్ స్టేషన్, చిల్డ్రన్స్ పార్క్, వాటర్ ట్యాంక్, సబ్‌స్టేషన్ తదితర అవసరాల కోసం స్థలం కేటాయించాలని కోరినట్లు తెలిపారు. ఈ విజ్ఞప్తిపై అప్పటి ప్రభుత్వం స్పందించి సంబంధిత జీవో జారీ చేసిందని వివరించారు.

పార్కు గేటు సమస్యపై వారం రోజుల క్రితం కాలనీవాసులను జోనల్ కమిషనర్ వద్దకు తీసుకెళ్లి అధికారులతో చర్చించినట్లు తెలిపారు. పార్కులో వాకింగ్ చేసే ప్రజలకు ఇబ్బందులు కలగకుండా గేటు ఏర్పాటు చేయాలని కోరినట్లు పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో శుక్రవారం ఇంజనీరింగ్ అధికారులు పార్కు పరిసరాలను పరిశీలించేందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి అధికారులతో మాట్లాడుతూ.. పార్కులో నుంచి గేటు ఏర్పాటు చేయకుండా, పక్కనే ఉన్న దేవాలయం సమీపంలో గేటు నిర్మిస్తే ఎవరికీ ఇబ్బందులు ఉండవని సూచించారు. అయితే ఆ ప్రాంతంలో గేటు నిర్మాణం చేపడితే ప్రస్తుతం ఉన్న వాచ్‌మెన్ గదిలో కొంత భాగాన్ని తొలగించాల్సి వస్తుందని తెలిపారు. అందువల్ల వాచ్‌మెన్‌కు ప్రత్యామ్నాయంగా కొత్త గదిని నిర్మించడంతో పాటు పార్కులో వాకింగ్ ట్రాక్‌ను కూడా పునరుద్ధరించాలని అధికారులను కోరారు.

ఎమ్మెల్యే సూచనల మేరకు దేవాలయం పక్కన ఉన్న స్థలాన్ని పరిశీలించిన అధికారులు అక్కడే గేటు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పార్కులో వాకింగ్‌కు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై స్పందించిన ఎమ్మెల్యేకు కాలనీవాసులు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో సరూర్‌నగర్ డిప్యూటీ కమిషనర్ శ్రీకాంత్, ఇంజనీరింగ్ అధికారులు విశ్వకుమార్, అనిత, భారతి, మాజీ కార్పొరేటర్ జిన్నారం విఠల్‌రెడ్డి, తోట మహేష్ యాదవ్, చంద్రశేఖర్‌రెడ్డి, త్రివేది, జయశ్రీ, విశ్వప్రేమ్, గట్టు శీను, రమణారెడ్డి, కాలనీ అధ్యక్షుడు బాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.