BREAKING
thumb ● ఆర్మూర్‌లో నవంబర్ 20న మంత్రి సీతక్క పర్యటన thumb ● ఈ నెల 20న పెర్కిట్‌లో శ్రీశ్రీ భీమన్న ఉత్సవ దర్బార్ thumb ● పులివెందుల పోలీసు స్టేషన్ ముందు ధర్నా చేస్తున్న టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి.... thumb ● ఆగడూరులో దాడి ఘటన స్థలాన్ని పరిశీలించిన బీటెక్ రవి thumb ● అర్హులైన పేదలకు చేయూత పెన్షన్లు.. సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటాం thumb ● నాగార్జున పాఠశాలలో ఆత్మీయంగా అంతర్జాతీయ పురుషుల దినోత్సవ వేడుకలు thumb ● దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి: డీఐజీని కోరిన బీటెక్ రవి thumb ● ఈశ్వరమ్మ 101వ జయంతి సందర్భంగా 101 చీరల పంపిణీ thumb ● తెలంగాణ ఇంటర్ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్ విడుదల thumb ● జాతీయస్థాయి స్పీడ్ హ్యాండ్‌బాల్ పోటీలకు క్రిష్ణవేణి విద్యార్థిని ఎంపిక thumb ● ఆర్మూర్‌లో నవంబర్ 20న మంత్రి సీతక్క పర్యటన thumb ● ఈ నెల 20న పెర్కిట్‌లో శ్రీశ్రీ భీమన్న ఉత్సవ దర్బార్ thumb ● పులివెందుల పోలీసు స్టేషన్ ముందు ధర్నా చేస్తున్న టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి.... thumb ● ఆగడూరులో దాడి ఘటన స్థలాన్ని పరిశీలించిన బీటెక్ రవి thumb ● అర్హులైన పేదలకు చేయూత పెన్షన్లు.. సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటాం thumb ● నాగార్జున పాఠశాలలో ఆత్మీయంగా అంతర్జాతీయ పురుషుల దినోత్సవ వేడుకలు thumb ● దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి: డీఐజీని కోరిన బీటెక్ రవి thumb ● ఈశ్వరమ్మ 101వ జయంతి సందర్భంగా 101 చీరల పంపిణీ thumb ● తెలంగాణ ఇంటర్ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్ విడుదల thumb ● జాతీయస్థాయి స్పీడ్ హ్యాండ్‌బాల్ పోటీలకు క్రిష్ణవేణి విద్యార్థిని ఎంపిక
Test 4
Date of Publish : 19 November 2026, 06:51 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఉయ్యూరు క్రైస్తవుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
19 Nov, 2026 - 06:51 PM
14 వీక్షణలు

టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు వై.వీ.బి. రాజేంద్రప్రసాద్  

స్మశానవాటిక సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా.. టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు వై.వీ.బి. రాజేంద్రప్రసాద్ హామీ

ఉయ్యూరు, నవంబర్ 19: ఉయ్యూరు యునైటెడ్ క్రిస్టియన్ ఫెలోషిప్ సంఘం నాయకులు తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు వై.వీ.బి. రాజేంద్రప్రసాద్‌ను కలిసి క్రైస్తవుల సమస్యలను వివరించారు. ఉయ్యూరు మున్సిపాలిటీ చైర్మన్‌గా ప్రవీణ్ కుమార్ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించి, మంచి మెజారిటీ వచ్చేలా సహకరించిన రాజేంద్రప్రసాద్‌కు క్రైస్తవ సంఘం పెద్దలు, యునైటెడ్ క్రిస్టియన్ ఫెలోషిప్ నాయకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్, ప్రవీణ్ కుమార్‌లను అభినందించి ఘనంగా సత్కరించారు. అనంతరం ఉయ్యూరు ప్రాంత క్రైస్తవులు ఎన్నో సంవత్సరాలుగా ఎదుర్కొంటున్న స్మశానవాటిక సమస్యను నాయకులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. అదేవిధంగా మున్సిపాలిటీలో కో-ఆప్షన్ సభ్యుడిగా క్రైస్తవులకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు క్రైస్తవుల అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తున్నారని తెలిపారు. క్రైస్తవుల సంక్షేమం, భద్రత కోసం మైనారిటీ విభాగాల ద్వారా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, గతంలో పార్టీ వేదికలపై సెమీ క్రిస్మస్ వేడుకలు వంటి కార్యక్రమాలను నిర్వహించామని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో కూడా క్రైస్తవుల అభివృద్ధి, సంక్షేమానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఉయ్యూరు ప్రాంత క్రైస్తవులు ఎదుర్కొంటున్న సమస్యలను, ముఖ్యంగా దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న స్మశానవాటిక సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కారమయ్యేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. క్రైస్తవ సంఘాల నాయకులు తమ సమస్యలను తన దృష్టికి తీసుకురావడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యునైటెడ్ క్రిస్టియన్ ఫెలోషిప్ అధ్యక్షుడు డాక్టర్ జాన్ డేవిడ్, ఐబీఎం చర్చి అధ్యక్షుడు దీపక్ కుమార్, కార్యదర్శులు ఆర్చ్ ఫాల్ట్, విలియం బూత్, క్రైస్తవ సంఘం పెద్దలు వల్లూరి రవి మాస్టర్, న్యాయవాది చంటిబాబు తదితర క్రైస్తవ పెద్దలు, బోధకులు, విశ్రాంత ఉద్యోగులు, న్యాయవాదులు పాల్గొన్నారు.