BREAKING
thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● రామన్నపేటలో అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● రామన్నపేటలో అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు
Date of Publish : 14 October 2026, 01:24 pm
Posted by : BOYA SWAMY

చిన్నకాపర్తిలో వారం రోజుల సుదర్శన క్రియ, యోగా, ధ్యాన కార్యక్రమాలు ప్రారంభం

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల / చిన్నకాపర్తి
Reporter
Boya Swamy Chityala Mandal
14 Oct, 2026 - 01:24 PM
40 వీక్షణలు

చిన్నకాపర్తి, అక్టోబర్ 14: ప్రతి ఒక్కరూ శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ప్రశాంతమైన జీవనం సాగించేందుకు యోగా, ధ్యానం దోహదపడతాయని నిర్వాహకులు తెలిపారు. నల్గొండ జిల్లా చిట్యాల మండలం చిన్నకాపర్తి గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో వారం రోజులపాటు నిర్వహించనున్న సుదర్శన క్రియ, యోగా, ధ్యాన కార్యక్రమాలు బుధవారం ప్రారంభమయ్యాయి.

గుత్తా వెంకట్ రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ గుత్తా అమిత్ కుమార్ రెడ్డి సహకారంతో, గ్రామ సర్పంచ్ ఆవుల సుందర్ యాదవ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు రవిశంకర్‌కు గురువందనం సమర్పించారు.

ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ నల్గొండ జిల్లా కోఆర్డినేటర్ పల్లపు బుద్ధుడు గ్రామస్తులు, యువకులు, భవానీ మాలధారులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఇందులో భాగంగా వార్మప్ వ్యాయామాలు, యోగాసనాలు, ప్రాణాయామం, ధ్యానం, సూర్య నమస్కారాలను చేయించారు. ఆయా సాధనల ప్రాముఖ్యతను వివరించారు.

యోగా, ధ్యానం, సుదర్శన క్రియ వంటి సాధనలతో ఒత్తిడిని తగ్గించుకోవడానికి, మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవడానికి అవకాశం ఉంటుందని నిర్వాహకులు వివరించారు. యువత ఒత్తిడి, ఆందోళనలకు దూరంగా ఉంటూ ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని సూచించారు. సమాజ సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ దేశాభివృద్ధికి తమ వంతు సహకారం అందించాలని పిలుపునిచ్చారు.

గ్రామంలో ఇలాంటి కార్యక్రమాల నిర్వహణకు సహకరించిన గుత్తా వెంకట్ రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ గుత్తా అమిత్ కుమార్ రెడ్డికి గ్రామస్తులు, యువకులు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో వలిగొండ సత్యనారాయణ, పల్లపు ప్రశాంత్, ఆవుల రమేష్ యాదవ్, పొలిమేర దశరథ, శిలివేరు పరమేష్, గురిజ శంకరయ్య, ఈరమళ్ల శ్రీను, ఈరమళ్ల వెంకన్నతో పాటు భవానీ మాలధారులు, యువకులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.