BREAKING
thumb ● ఆర్మూర్‌లో నవంబర్ 20న మంత్రి సీతక్క పర్యటన thumb ● ఈ నెల 20న పెర్కిట్‌లో శ్రీశ్రీ భీమన్న ఉత్సవ దర్బార్ thumb ● పులివెందుల పోలీసు స్టేషన్ ముందు ధర్నా చేస్తున్న టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి.... thumb ● ఆగడూరులో దాడి ఘటన స్థలాన్ని పరిశీలించిన బీటెక్ రవి thumb ● అర్హులైన పేదలకు చేయూత పెన్షన్లు.. సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటాం thumb ● నాగార్జున పాఠశాలలో ఆత్మీయంగా అంతర్జాతీయ పురుషుల దినోత్సవ వేడుకలు thumb ● దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి: డీఐజీని కోరిన బీటెక్ రవి thumb ● ఈశ్వరమ్మ 101వ జయంతి సందర్భంగా 101 చీరల పంపిణీ thumb ● తెలంగాణ ఇంటర్ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్ విడుదల thumb ● జాతీయస్థాయి స్పీడ్ హ్యాండ్‌బాల్ పోటీలకు క్రిష్ణవేణి విద్యార్థిని ఎంపిక thumb ● ఆర్మూర్‌లో నవంబర్ 20న మంత్రి సీతక్క పర్యటన thumb ● ఈ నెల 20న పెర్కిట్‌లో శ్రీశ్రీ భీమన్న ఉత్సవ దర్బార్ thumb ● పులివెందుల పోలీసు స్టేషన్ ముందు ధర్నా చేస్తున్న టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి.... thumb ● ఆగడూరులో దాడి ఘటన స్థలాన్ని పరిశీలించిన బీటెక్ రవి thumb ● అర్హులైన పేదలకు చేయూత పెన్షన్లు.. సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటాం thumb ● నాగార్జున పాఠశాలలో ఆత్మీయంగా అంతర్జాతీయ పురుషుల దినోత్సవ వేడుకలు thumb ● దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి: డీఐజీని కోరిన బీటెక్ రవి thumb ● ఈశ్వరమ్మ 101వ జయంతి సందర్భంగా 101 చీరల పంపిణీ thumb ● తెలంగాణ ఇంటర్ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్ విడుదల thumb ● జాతీయస్థాయి స్పీడ్ హ్యాండ్‌బాల్ పోటీలకు క్రిష్ణవేణి విద్యార్థిని ఎంపిక
Test 4
Date of Publish : 19 November 2026, 06:00 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వాల ఆటలేమిటి?

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
19 Nov, 2026 - 06:00 PM
14 వీక్షణలు

ఫీజు రీయింబర్స్‌మెంట్, విద్యా దీవెన, వసతి దీవెన బకాయిలను తక్షణమే విడుదల చేయాలి – సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య అమరావతి: రాష్ట్రంలో విద్యార్థుల విద్యాభవిష్యత్తును కాపాడాల్సిన ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదలలో జాప్యం చేస్తూ, విద్యా దీవెన, వసతి దీవెన పథకాల అమలులో నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని సీపీఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య విమర్శించారు. ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విద్యార్థుల సమస్యలపై గొంతెత్తి, అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వ బకాయిలంటూ బాధ్యత నుంచి తప్పించుకోవడం సమంజసం కాదని పేర్కొన్నారు. ప్రభుత్వం మారినంత మాత్రాన విద్యార్థులకు రావాల్సిన ఫీజులు, సంక్షేమ పథకాల నిధులు రద్దు కావని స్పష్టం చేశారు. గత ప్రభుత్వాలు చేసిన అప్పులు, బకాయిలను సరిదిద్దాల్సిన బాధ్యత ప్రస్తుత ప్రభుత్వంపై ఉందని, ఆ భారాన్ని విద్యార్థులపై మోపడం తగదని అన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాల కింద రూ.4,962 కోట్లకు పైగా విడుదల చేశామని ప్రభుత్వం ప్రకటిస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో విద్యార్థులు, కళాశాలలకు బకాయిల సమస్య ఎందుకు కొనసాగుతోందని ప్రశ్నించారు. విద్యా దీవెన, వసతి దీవెన పథకాల కింద ఎంతమేర నిధులు విడుదల చేశారు, గత విద్యా సంవత్సరాలకు సంబంధించి ఎంత బకాయి ఉంది, ప్రస్తుత విద్యా సంవత్సరానికి ఎన్ని నిధులు అవసరం అనే వివరాలను ప్రభుత్వం వెల్లడించాలని డిమాండ్ చేశారు. పథకాల వారీగా, విద్యా సంవత్సరాల వారీగా చెల్లింపులు, పెండింగ్ బకాయిల వివరాలతో శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు. ప్రభుత్వం నుంచి ఫీజులు అందకపోవడంతో కొన్ని విద్యాసంస్థలు విద్యార్థులపై ఒత్తిడి తెస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని ఈశ్వరయ్య పేర్కొన్నారు. ఫీజుల కోసం వేధించడం, పరీక్షలకు అనుమతించకపోవడం, హాల్‌టికెట్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేయడం, ధ్రువపత్రాలు నిలిపివేయడం వంటి చర్యలు విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని తెలిపారు. ప్రభుత్వ బకాయిలకు విద్యార్థులను బాధ్యులుగా చేయడం సరికాదని, ఇలాంటి చర్యలను అడ్డుకునేలా విద్యాశాఖ తక్షణమే ఆదేశాలు జారీ చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల ఆత్మహత్యలు, విద్యాసంస్థల్లో ఎదురవుతున్న వేధింపులు ఆందోళన కలిగిస్తున్నాయని, ఈ ఘటనలపై విద్యాశాఖ బాధ్యత వహించాలని అన్నారు. విద్యార్థులపై ఆర్థిక ఒత్తిళ్లు, మానసిక ఆందోళనలు, కళాశాలల వేధింపులపై సమగ్ర విచారణ జరపాలని సూచించారు. విద్యార్థులకు అవసరమైన మానసిక సహాయం, కౌన్సెలింగ్, రక్షణ కల్పించడంతో పాటు ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలని కోరారు. పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించేందుకు ఫీజు రీయింబర్స్‌మెంట్, విద్యా దీవెన, వసతి దీవెన పథకాలు కీలకమని ఈశ్వరయ్య పేర్కొన్నారు. హాస్టల్, భోజన ఖర్చులు భరించలేని పరిస్థితుల్లో వసతి దీవెన నిధులు అందకపోవడం విద్యార్థులకు మరింత భారంగా మారుతోందన్నారు. ఈ పథకాలు కేవలం ఎన్నికల హామీలుగా, ప్రభుత్వ ప్రచార కార్యక్రమాలుగా మిగిలిపోకూడదని, విద్యార్థుల విద్యా హక్కులకు భరోసా కల్పించేలా అమలు చేయాలని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సీపీఐ తరఫున పలు డిమాండ్లను ప్రభుత్వం ముందుంచారు. గత, ప్రస్తుత ప్రభుత్వాల కాలానికి సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలన్నీ తక్షణమే విడుదల చేయాలని, విద్యా దీవెన, వసతి దీవెన నిధులను వెంటనే చెల్లించాలని కోరారు. పథకాల వారీగా, విద్యా సంవత్సరాల వారీగా నిధుల కేటాయింపులు, విడుదలలు, పెండింగ్ బకాయిలపై సమగ్ర శ్వేతపత్రం ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఫీజుల పేరుతో విద్యార్థులను వేధించే కళాశాలలపై చర్యలు తీసుకోవాలని, పరీక్షలకు అనుమతించకుండా అడ్డుకోవడం, ధ్రువపత్రాలు నిలిపివేయడం వంటి చర్యలను నిరోధించాలని కోరారు. అదేవిధంగా విద్యార్థుల చదువు మధ్యలో నిలిచిపోకుండా కళాశాలలకు ప్రభుత్వం నేరుగా ఫీజులు చెల్లించే విధానాన్ని పటిష్టం చేయాలని, విద్యార్థుల ఆత్మహత్యలు, మానసిక ఒత్తిళ్లు, విద్యాసంస్థల వేధింపులపై సమగ్ర విచారణ చేపట్టాలని సూచించారు. పేద విద్యార్థులకు నష్టం కలిగించే నిబంధనలు, జీవోలను సమీక్షించి అవసరమైన మార్పులు చేయాలని కోరారు. ప్రభుత్వాలు మారుతున్నా విద్యార్థుల సమస్యలు పరిష్కారం కాకపోవడం ఆందోళనకరమని ఈశ్వరయ్య పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని, బకాయిల విడుదలలో జాప్యం చేయకుండా విద్యార్థుల చదువుకు ఎదురవుతున్న అడ్డంకులను తొలగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తును రాజకీయాలకు, ప్రభుత్వాల మధ్య బాధ్యతల బదిలీకి బలి చేయకుండా విద్యారంగాన్ని సంక్షోభం నుంచి కాపాడాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య స్పష్టం చేశారు

.