BREAKING
thumb ● వెలవర్తిపాడు ఎంపీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి విజయం thumb ● దీపావళి వేడుకల్లో జాగ్రత్తలు పాటించాలి-ఎస్‌ఐ సీత పాండు thumb ● జంగంగుంట్లపాలెం ఎంపీటీసీ స్థానంలో వైసీపీ విజయం thumb ● పల్లె వెంకన్న కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి thumb ● కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు thumb ● మునుగోడు, దేవరకొండ రైతులకు సాగునీటి కోసం ఎదురుచూపులే thumb ● చీకటిని పారద్రోలే వెలుగుల పండుగ దీపావళి thumb ● ఎండిన చెరువులను ఎస్సారెస్పీ నీటితో నింపాలి thumb ● తొట్టంబేడు మండల అభివృద్ధికి కృషి చేస్తా: రావిళ్ల మునిరాజా నాయుడు thumb ● జాగ్రత్తలు పాటిస్తూ సురక్షితంగా దీపావళి జరుపుకోవాలి thumb ● వెలవర్తిపాడు ఎంపీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి విజయం thumb ● దీపావళి వేడుకల్లో జాగ్రత్తలు పాటించాలి-ఎస్‌ఐ సీత పాండు thumb ● జంగంగుంట్లపాలెం ఎంపీటీసీ స్థానంలో వైసీపీ విజయం thumb ● పల్లె వెంకన్న కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి thumb ● కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు thumb ● మునుగోడు, దేవరకొండ రైతులకు సాగునీటి కోసం ఎదురుచూపులే thumb ● చీకటిని పారద్రోలే వెలుగుల పండుగ దీపావళి thumb ● ఎండిన చెరువులను ఎస్సారెస్పీ నీటితో నింపాలి thumb ● తొట్టంబేడు మండల అభివృద్ధికి కృషి చేస్తా: రావిళ్ల మునిరాజా నాయుడు thumb ● జాగ్రత్తలు పాటిస్తూ సురక్షితంగా దీపావళి జరుపుకోవాలి
Test 4
Date of Publish : 07 November 2026, 05:55 pm
Posted by : K MAHESH

మునుగోడు ఏం పాపం చేసింది? అభివృద్ధిలో సమాన ప్రాధాన్యత ఇవ్వాలి

తెలంగాణ
/ నల్గొండ / మునుగోడు
Reporter
K Mahesh Munugodu Constituency
07 Nov, 2026 - 05:55 PM
56 వీక్షణలు

-ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి

కొడంగల్ తరహాలో మునుగోడులోనూ అభివృద్ధి పనులు చేపట్టాలని సీఎం రేవంత్‌రెడ్డికి విజ్ఞప్తి

మునుగోడు (ఎన్ టుడే న్యూస్), నవంబర్ 7: కొడంగల్ నియోజకవర్గంలో రూ.9 వేల కోట్లతో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల తరహాలోనే మునుగోడు నియోజకవర్గాన్ని కూడా సమానంగా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కోరారు.

పీఆర్టీయూ నేత, ప్రధానోపాధ్యాయుడు బిక్షంగౌడ్ ఉద్యోగ విరమణ సందర్భంగా నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడారు. మునుగోడు నియోజకవర్గం ఏం పాపం చేసిందని ప్రశ్నిస్తూ, అభివృద్ధి విషయంలో ఈ ప్రాంతానికి కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.

నియోజకవర్గంలో తాగునీరు, సాగునీటి వసతులతో పాటు ప్రభుత్వ ఆసుపత్రులు, అవసరమైన మౌలిక సదుపాయాలు లేవని ఆయన పేర్కొన్నారు. ఈ సమస్యలను పరిష్కరించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

బీసీ వర్గానికి చెందిన బిక్షంగౌడ్‌కు ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వాలని తాను కోరినట్లు రాజగోపాల్‌రెడ్డి తెలిపారు. మునుగోడు నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం సమాన ప్రాధాన్యత కల్పించాలని ఆయన కోరారు.