భర్త చదివిస్తే.. పోలీస్ అయ్యాక వదిలేసి మరొకరితో భార్య ప్రేమాయణం
బీహార్‌లోని కతిహార్ జిల్లాలో వెలుగు చూసిన సంచలన ఘటన
2021లో ప్రేమ పెళ్లి చేసుకున్న కైమూర్‌కు హన్స్‌లాల్ గుప్తా, యూపీకి చెందిన ప్రతిభ విశ్వకర్మ
వీరి పెళ్లిని హన్స్‌లాల్ ఫ్యామిలీ అంగీకరించడంతో.. 2024లో కైమూర్ కోర్టు ద్వారా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు
పెళ్లయ్యాక ఉన్నత చదువులు చదువుకోవాలనుందని ప్రతిభ చెప్పడంతో.. అండగా నిలిచిన మామ పరమహంస్ గుప్తా, భర్త హన్స్‌లాల్
ఈ-రిక్షా నడిపి.. రూ.8-9 లక్షలు ఖ్చు చేసి.. ప్రతిభను చదివించింది హన్స్‌లాల్ కుటుంబం
ప్రతిభ బీహార్ పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడంతో.. కతిహార్ జిల్లాలోని మన్సాహి పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా నియామకం
ఉద్యోగం వచ్చాక ప్రతిభ తనని దూరం పెట్టిందని.. రాహుల్ శర్మ అనే మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందని హన్స్‌లాల్ ఆరోపణలు
ప్రతిభ తనను భర్తగా కూడా అంగీకరించడం లేదని, తమది బలవంతపు పెళ్లి అని చెప్తోందని హన్స్‌లాల్ ఆవేదన
భార్య తీరుతో విసిగిపోయి.. కతిహార్ ఎస్పీ పరిచయ్ కుమార్‌ను కలిసి లిఖితపూర్వక ఫిర్యాదును అందజేసిన భర్త హన్స్‌లాల్
ఇది వ్యక్తిగత విఝయం కాబట్టి.. మహిళా పోలీస్ స్టేషన్‌లో కౌన్సెలింగ్ ద్వారా సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామని ఎస్పీ హామీ
కౌన్సెలింగ్ ద్వారా వివాదం పరిష్కారమై.. తమ వైవాహిక బంధం నిలబడుతుందని ఆశిస్తున్నాడు హన్స్‌లాల్