అసత్య ప్రచారాలపై పరువునష్టం దావా వేస్తా
మేడ్చల్ జిల్లా: బౌరంపేట్ గ్రామ పరిధిలోని 259/P సర్వే నంబర్లో ఉన్న 3.35 ఎకరాల భూ వివాదంతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఓ వ్యక్తి స్పష్టం చేశారు. వాస్తవాలు తెలుసుకోకుండా ఉద్దేశపూర్వకంగా తన పేరును ఈ వివాదంలోకి లాగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎలాంటి ఆధారాలు లేకుండా తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ముఖ్యంగా సామాజిక మాధ్యమాల్లో తప్పుడు సమాచారంతో పోస్టులు పెట్టి తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తున్న వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.
సమాజంలో తన ప్రతిష్టను దిగజార్చేలా వ్యవహరిస్తున్న వారిపై త్వరలోనే పరువునష్టం దావా వేస్తానని స్పష్టం చేశారు. తప్పుడు ప్రచారాలకు పాల్పడుతున్న వారిని చట్టపరంగా ఎదుర్కొంటానని పేర్కొన్నారు.
బీఆర్ఎస్ పార్టీకి చెందిన సోషల్ మీడియా విభాగం రాజకీయ దురుద్దేశంతోనే తనపై అసత్య ప్రచారాలు చేస్తోందని ఆయన ఆరోపించారు. ఈ నేపథ్యంలో ప్రజలు వాస్తవాలను తెలుసుకోకుండా సామాజిక మాధ్యమాల్లో వస్తున్న ప్రచారాలను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు.
చట్టాన్ని ఉల్లంఘిస్తూ తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసే వారు న్యాయపరమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.