BREAKING
thumb ● సంస్థాన్ నారాయణపురంలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● ఇందిరమ్మ ఇళ్లలో తొలి దీపావళి.. లబ్ధిదారుల ఇళ్లలో పండుగ సందడి thumb ● నారాయణపురంలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● MLC ఓటు నమోదుకు మరో అవకాశం.. డిసెంబర్ 10 వరకు గడువు thumb ● తూప్రాన్‌లో ఘనంగా ఎస్‌జీఎఫ్‌ఐ నెట్‌బాల్ సెలక్షన్ కమ్ ట్రయల్స్ thumb ● ఆర్టీఐ రక్షక్ యాదాద్రి జోనల్ ఇన్‌చార్జిగా కోల మహేష్ thumb ● ఎమ్మెల్యే వేముల వీరేశం నివాసంలో ఘనంగా దీపావళి వేడుకలు thumb ● చిట్యాలలో విషాదం.. రైలుకు ఎదురెళ్లి వ్యక్తి ఆత్మహత్య thumb ● పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదులో నల్లగొండ జిల్లా టాప్ thumb ● మేడారం నుంచి తిరిగొస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి thumb ● సంస్థాన్ నారాయణపురంలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● ఇందిరమ్మ ఇళ్లలో తొలి దీపావళి.. లబ్ధిదారుల ఇళ్లలో పండుగ సందడి thumb ● నారాయణపురంలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● MLC ఓటు నమోదుకు మరో అవకాశం.. డిసెంబర్ 10 వరకు గడువు thumb ● తూప్రాన్‌లో ఘనంగా ఎస్‌జీఎఫ్‌ఐ నెట్‌బాల్ సెలక్షన్ కమ్ ట్రయల్స్ thumb ● ఆర్టీఐ రక్షక్ యాదాద్రి జోనల్ ఇన్‌చార్జిగా కోల మహేష్ thumb ● ఎమ్మెల్యే వేముల వీరేశం నివాసంలో ఘనంగా దీపావళి వేడుకలు thumb ● చిట్యాలలో విషాదం.. రైలుకు ఎదురెళ్లి వ్యక్తి ఆత్మహత్య thumb ● పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదులో నల్లగొండ జిల్లా టాప్ thumb ● మేడారం నుంచి తిరిగొస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
Test 4
Date of Publish : 08 November 2026, 12:44 pm
Posted by : THALLAPALLI LAKSHMANA

చిక్కు వెంట్రుకలు సేకరించే మహిళకు జడ్పీటీసీ ఎన్నికల్లో విజయం

ఆంధ్రప్రదేశ్
Reporter
Thallapalli Lakshmana ప్రకాశం జిల్లా స్టాఫ్ రిపోర్టర్
08 Nov, 2026 - 12:44 PM
17 వీక్షణలు

పామర్రులో టీడీపీ అభ్యర్థి శీలం వెంకటేశ్వరమ్మ గెలుపు.. 8,469 ఓట్ల మెజార్టీ

పామర్రు (ఎన్ టుడే న్యూస్):

కృష్ణా జిల్లా పామర్రు జడ్పీటీసీ ఎన్నికల్లో నిరుపేద కుటుంబానికి చెందిన మహిళ అనూహ్య విజయం సాధించారు. చిక్కు వెంట్రుకలు సేకరించి విక్రయించడం ద్వారా జీవనం సాగించే శీలం వెంకటేశ్వరమ్మ జడ్పీటీసీగా ఎన్నికయ్యారు.

పామర్రు జడ్పీటీసీ స్థానం ఎస్టీ మహిళకు రిజర్వ్ అయింది. ఈ స్థానంలో తెలుగుదేశం పార్టీ (టీడీపీ) తరఫున శీలం వెంకటేశ్వరమ్మ పోటీ చేశారు. తాజాగా వెలువడిన ఎన్నికల ఫలితాల్లో ఆమె 8,469 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.

సాధారణ జీవితం గడుపుతూ జీవనోపాధి కోసం చిక్కు వెంట్రుకలు సేకరించి విక్రయించే స్థాయి నుంచి జడ్పీటీసీగా ఎన్నిక కావడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

ఈ సందర్భంగా పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా విజయం సాధించిన వెంకటేశ్వరమ్మ దంపతులను శాలువాతో సత్కరించారు.