BREAKING
మే 11న సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ 55 మిలియన్లలో ఒకసారి జరిగే అద్భుతం.. గంజాయి మాఫియాకు పోలీసుల చెక్ జనసేనలోకి భారీ చేరికలు నవదంపతులను ఆశీర్వదించిన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి డిపిర్టియూ ఏలూరు జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షునిగా సత్తెనపల్లి రాము నియామకం రోడ్డు ప్రమాద బాధితులకు పీఎం-రాహత్ వరం కనబడుట లేదు కుక్కలగూడూర్ గ్రామ మహిళ అదృశ్యం కూరెల్ల గ్రామంలో గ్రామదేవత బొడ్రాయి పండుగ నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపిన శ్రీ సాయి దుర్గ యూత్ సంఘం మే 11న సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ 55 మిలియన్లలో ఒకసారి జరిగే అద్భుతం.. గంజాయి మాఫియాకు పోలీసుల చెక్ జనసేనలోకి భారీ చేరికలు నవదంపతులను ఆశీర్వదించిన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి డిపిర్టియూ ఏలూరు జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షునిగా సత్తెనపల్లి రాము నియామకం రోడ్డు ప్రమాద బాధితులకు పీఎం-రాహత్ వరం కనబడుట లేదు కుక్కలగూడూర్ గ్రామ మహిళ అదృశ్యం కూరెల్ల గ్రామంలో గ్రామదేవత బొడ్రాయి పండుగ నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపిన శ్రీ సాయి దుర్గ యూత్ సంఘం
www.ntodaynews.com

ప్రజా ప్రభుత్వంలో మహిళలకు అధిక ప్రాధాన్యత

తెలంగాణ
17 Jul, 2025 - 07:44 AM
43 వీక్షణలు
ప్రజా ప్రభుత్వంలో మహిళలకు అధిక ప్రాధాన్యత-- ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య N TODAY NEWS: ఆలేరు మహిళలు ఆర్థికంగా ఎదిగి బలోపేతం అవ్వడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్ మరియు ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య అన్నారు. గురువారం రోజున ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో భాగంగా ఆలేరు నియోజకవర్గంలోని ఆలేరు పట్టణంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో వై.ఎస్.ఎన్ ఫంక్షన్ హాల్ నందు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ప్రభుత్వ విప్, ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, జిల్లా కలెక్టర్ హనుమంతరావు,స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మరియు ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య మాట్లాడుతూ... ప్రభుత్వం ఏ సంక్షేమ కార్యక్రమం మొదలుపెట్టిన ముందుగా మహిళలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిందని, మహిళలు ఆర్థికంగా ఎదగడానికి ఎంతో కృషి చేస్తుందన్నారు.కోటి మంది మహిళలు కోటీశ్వరులు చేయడమే ముఖ్యమంత్రి ఆలోచన అని అందుకు ప్రతి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమానికి మహిళలకే అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ప్రభుత్వం వచ్చాక మహిళలకు అనేక రంగాలలో ముందు ఉంచామని, మహిళలకు వడ్డీ లేని రుణాలు,నియోజకవర్గంలో 50 శాతం ఐ.కే.పి సెంటర్ లు కూడా మహిళల కే ఇవ్వడం జరిగిందన్నారు. ఇవన్నీ మహిళలతోనే సాధ్యమన్నారు.ప్రభుత్వం వచ్చిన మొదటిలోనే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించిందన్నారు మహిళలకు 200 ఉచిత కరెంట్, 500 రూపాయలకే వంట గ్యాస్ ఇచ్చి మహిళలను ముందుకు తీసుకెళ్తున్నారన్నారు. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ప్రభుత్వం బస్సుల యాజమాన్యులుగా మహిళలను చేయబోతుందన్నారు. పెట్రోల్ బంకులు, మహిళా శక్తి క్యాంటీన్ల ద్వారా అన్ని రంగాల్లో మహిళలు ఆర్థికంగా బలోపేతం అవుతారన్నారు. కరెంటు ఉత్పత్తి అయ్యేందుకు సోలార్ పవర్ ప్లాంట్లు మహిళలకు ప్రభుత్వమే భూమి ఇచ్చి అలకేషన్ చేసి మహిళలను చేయాలని ముఖ్యమంత్రి ఆలోచన అని అన్నారు. మహిళా సంఘాలు బలోపేతం చేయడానికి గతంలో 18 నుంచి 20 సంవత్సరాలు ఉంటే ఈ ప్రభుత్వం వచ్చాక ఇప్పుడు 15 నుంచి 62 సంవత్సరాల వరకు సభ్యత్వం ఇస్తున్నామన్నారు. ఏమైనా ప్రమాదం జరిగితే 10 లక్షలు మహిళలకు ప్రమాద బీమా కింద ఇవ్వడం జరుగుతుంది అన్నారు . ఎవరైనా చనిపోతే బ్యాంకులో రుణం ఉన్న కూడా ప్రభుత్వమే కట్టి మహిళలకు పెద్ద పీట వేయడానికి ప్రభుత్వం మహిళలను ముందుకు తీసుకెళ్తున్నారన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు కూడా మహిళల పేరు మీదనే ఇచ్చామన్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు అతి పేదరికంతో ఉంటే మహిళా సంఘాల ద్వారా లోన్ లు ఇచ్చే గొప్ప కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ముందుకు తీసుకెళ్తున్నారు. బేస్మెంట్ లెవెల్ పూర్తయిన వెంటనే లక్ష రూపాయలు ప్రతి సోమవారం లబ్ధిదారుల ఖాతాలో జమ చేయడం జరుగుతుందని, తదుపరి పిల్లర్ లెవెల్, స్లాబ్ లెవెల్ పూర్తయిన తర్వాత డబ్బులు జమ అవుతున్నాయని అన్నారు. ఇల్లు త్వరగా పూర్తి చేసుకున్న వారికి గృహప్రవేశానికి నూతన వస్తాలు పెట్టి గొర్రె పొట్టేలు ఇస్తున్నానని అందుకు లబ్ధిదారులు త్వరగా ఇల్లు పూర్తి చేసుకోవాలన్నారు. ఇంట్లో మహిళ ఆర్థికంగా పెరిగితే కుటుంబం అంతా సంతోషంగా ఉంటారన్నారు. ప్రభుత్వం ప్రతి పేద వారు కడుపు నిండా తినాలనే లక్ష్యంతో కొత్త రేషన్ కార్డులు కూడా ఇచ్చామన్నారు. ఎమ్మెల్సీ నెల్లకంటి సత్యం మాట్లాడుతూ...ప్రభుత్వం వచ్చాక మహిళల కోసం అనేక పథకాలు ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు.కోటి మంది మహిళలు కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకున్నదని,సమగ్ర అభివృద్ధి జరగాలంటే ముందుగా మహిళా అభివృద్ధి జరగాలని అన్నారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుకు వెళ్తూ ఆర్థికంగా ఎదగాలన్నారు. జిల్లా కలెక్టర్ హనుమంతరావు మాట్లాడుతూ... ఇందిరా మహిళా శక్తి సంబరాలు ఇంత ఘనంగా నిర్వహించుకుంటున్నామంటే మహిళలకే ప్రభుత్వం అన్ని రంగాలలో అధిక ప్రాధాన్యమిస్తుందని తదనగుణంగా మహిళలు ఆర్థికంగా బలోపేతం అవుతారన్నారు.ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి సంక్షేమ పథకంలో మహిళలను భాగస్వామ్యం చేస్తుందన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాలల్లో మహిళలు కాంట్రాక్టర్ గా మారి నిర్మాణాలు చేపట్టారన్నారు. పలు అభివృద్ధికి, సంక్షేమ కార్యక్రమాలకు ఇందిరా మహిళాశక్తి క్యాంటీన్, పెట్రోల్ బంకులు,అద్దె బస్సులు,స్కూల్ యూనిఫామ్ స్టిచ్చింగ్, ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ వంటి సంక్షేమ పథకాలు మహిళలకు ఇవ్వడం నిదర్శనం అని అన్నారు. మహిళ సంఘాలకి లోన్ భీమా,ప్రమాద బీమా,సౌకర్యం ప్రభుత్వం కల్పించిందన్నారు. అనంతరం స్వయం సహాయక సంఘాల సభ్యులకు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, సెర్ఫ్ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ చేసిన వివరాలు : మహిళ సంఘ సభ్యులకు వడ్డీ లేని రుణాలు :: 1,44,20,489/- చెక్కును, స్వయం సహాయక సంఘ సభ్యురాల నామిని (కటికల కిష్టయ్య )కు ప్రమాద బీమా రూ: 10,00,000లక్షల చెక్కును,ఆలేరు నియోజకవర్గం మహిళా సభ్యులకు బ్యాంకు రుణాలు:: 51,77,26,000/- చెక్కును,మహిళా సంఘ సభ్యులకు లోన్, బీమా క్లెయిమ్స్: 11,53,008/- గల చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారి నాగిరెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఐనాల చైతన్య మహేందర్ రెడ్డి, ప్రజా ప్రతినిధులు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube