BREAKING
thumb ● నారాయణ విద్యాసంస్థల ఖమ్మం జోన్ నారాయణ ప్రీమియర్ లీగ్ పోటీలు thumb ● లింబాద్రి గుట్టకు అయ్యప్ప స్వాముల పాదయాత్ర thumb ● రిజిస్ట్రేషన్ ఫార్మసిస్ట్ లేకుండా మెడికల్ షాపుల నిర్వహణపై చర్యలు తీసుకోవాలి thumb ● హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. కారు ఢీకొని ఆటో ప్రయాణికురాలు మృతి thumb ● గ్రామీణ వైద్యులపై దాడులు నిలిపివేయాలి thumb ● ఫతేపూర్ గ్రామంలో ఘనంగా జవహర్‌లాల్ నెహ్రూ జయంతి వేడుకలు thumb ● బాలల హృదయాల్లో శాస్త్రీయ విజ్ఞానం, దేశభక్తిని నింపిన మహానేత జవహర్‌లాల్ నెహ్రూ thumb ● అయ్యప్ప మాలధారణ స్వీకరించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి thumb ● పంచాయతీ ఎన్నికల్లోనూ కూటమి అభ్యర్థులదే విజయం: ఎమ్మెల్యే బండారు సత్యానందరావు thumb ● సర్పంచ్ ఎన్నికల్లో చిలువూరి రామకృష్ణంరాజు విజయానికి కృషి చేయాలి thumb ● నారాయణ విద్యాసంస్థల ఖమ్మం జోన్ నారాయణ ప్రీమియర్ లీగ్ పోటీలు thumb ● లింబాద్రి గుట్టకు అయ్యప్ప స్వాముల పాదయాత్ర thumb ● రిజిస్ట్రేషన్ ఫార్మసిస్ట్ లేకుండా మెడికల్ షాపుల నిర్వహణపై చర్యలు తీసుకోవాలి thumb ● హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. కారు ఢీకొని ఆటో ప్రయాణికురాలు మృతి thumb ● గ్రామీణ వైద్యులపై దాడులు నిలిపివేయాలి thumb ● ఫతేపూర్ గ్రామంలో ఘనంగా జవహర్‌లాల్ నెహ్రూ జయంతి వేడుకలు thumb ● బాలల హృదయాల్లో శాస్త్రీయ విజ్ఞానం, దేశభక్తిని నింపిన మహానేత జవహర్‌లాల్ నెహ్రూ thumb ● అయ్యప్ప మాలధారణ స్వీకరించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి thumb ● పంచాయతీ ఎన్నికల్లోనూ కూటమి అభ్యర్థులదే విజయం: ఎమ్మెల్యే బండారు సత్యానందరావు thumb ● సర్పంచ్ ఎన్నికల్లో చిలువూరి రామకృష్ణంరాజు విజయానికి కృషి చేయాలి
Test 4
Date of Publish : 14 November 2026, 01:50 pm
Posted by : SEETHA KIRAN KUMAR

ప్రేమ పేరుతో మోసం చేశాడని.. యువతి ఆత్మహత్య

తెలంగాణ
/ మహబూబాబాద్
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
14 Nov, 2026 - 01:50 PM
12 వీక్షణలు

రెండేళ్ల ప్రేమ తర్వాత కులం పేరుతో పెళ్లికి నిరాకరించిన యువకుడు.. 21 పేజీల లేఖ రాసి బలవన్మరణానికి పాల్పడిన సుష్మిత (24)

మహబూబాబాద్: రెండేళ్లుగా ప్రేమించిన యువకుడు కులం వేరనే కారణంతో పెళ్లికి నిరాకరించడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన మహబూబాబాద్ మండలం నడివాడ గ్రామంలో వెలుగుచూసింది. డిగ్రీ పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలకు సిద్ధమవుతున్న సుష్మిత (24) ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయింది. ఆమె మరణంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

వివరాల్లోకి వెళితే.. నడివాడ గ్రామానికి చెందిన కుమారస్వామి–సుకన్య దంపతుల కుమార్తె సుష్మిత డిగ్రీ పూర్తి చేసిన అనంతరం ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీ పరీక్షలకు సిద్ధమవుతోంది. ఇదే గ్రామానికి చెందిన అనిల్ అనే యువకుడితో ఆమె గత రెండేళ్లుగా ప్రేమలో ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఇటీవల తనను వివాహం చేసుకోవాలని సుష్మిత అనిల్‌ను కోరినట్లు తెలుస్తోంది.

అయితే కులాలు వేరని, తన కుటుంబ సభ్యులు పెళ్లికి అంగీకరించరని చెబుతూ అనిల్ వివాహాన్ని వాయిదా వేస్తూ వచ్చినట్లు బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పలుమార్లు పెళ్లి విషయాన్ని ప్రస్తావించినప్పటికీ స్పష్టమైన సమాధానం రాకపోవడంతో సుష్మిత తీవ్ర మనస్తాపానికి గురైనట్లు సమాచారం.

ఈ పరిస్థితుల్లో సుష్మిత 21 పేజీల లేఖ రాసి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిసింది. తనను మోసం చేసిన వారిని వదలవద్దంటూ తల్లిదండ్రులను కోరినట్లు సమాచారం. ఈ ఘటనతో ఆమె కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

తమ కుమార్తె మృతికి కారణమైన యువకుడిని అరెస్టు చేసి, ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సుష్మిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. అయితే ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, 21 పేజీల లేఖలోని అంశాలు, పోలీసుల దర్యాప్తు వివరాలు అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది.