BREAKING
thumb ● నారాయణ విద్యాసంస్థల ఖమ్మం జోన్ నారాయణ ప్రీమియర్ లీగ్ పోటీలు thumb ● లింబాద్రి గుట్టకు అయ్యప్ప స్వాముల పాదయాత్ర thumb ● రిజిస్ట్రేషన్ ఫార్మసిస్ట్ లేకుండా మెడికల్ షాపుల నిర్వహణపై చర్యలు తీసుకోవాలి thumb ● హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. కారు ఢీకొని ఆటో ప్రయాణికురాలు మృతి thumb ● గ్రామీణ వైద్యులపై దాడులు నిలిపివేయాలి thumb ● ఫతేపూర్ గ్రామంలో ఘనంగా జవహర్‌లాల్ నెహ్రూ జయంతి వేడుకలు thumb ● బాలల హృదయాల్లో శాస్త్రీయ విజ్ఞానం, దేశభక్తిని నింపిన మహానేత జవహర్‌లాల్ నెహ్రూ thumb ● అయ్యప్ప మాలధారణ స్వీకరించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి thumb ● పంచాయతీ ఎన్నికల్లోనూ కూటమి అభ్యర్థులదే విజయం: ఎమ్మెల్యే బండారు సత్యానందరావు thumb ● సర్పంచ్ ఎన్నికల్లో చిలువూరి రామకృష్ణంరాజు విజయానికి కృషి చేయాలి thumb ● నారాయణ విద్యాసంస్థల ఖమ్మం జోన్ నారాయణ ప్రీమియర్ లీగ్ పోటీలు thumb ● లింబాద్రి గుట్టకు అయ్యప్ప స్వాముల పాదయాత్ర thumb ● రిజిస్ట్రేషన్ ఫార్మసిస్ట్ లేకుండా మెడికల్ షాపుల నిర్వహణపై చర్యలు తీసుకోవాలి thumb ● హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. కారు ఢీకొని ఆటో ప్రయాణికురాలు మృతి thumb ● గ్రామీణ వైద్యులపై దాడులు నిలిపివేయాలి thumb ● ఫతేపూర్ గ్రామంలో ఘనంగా జవహర్‌లాల్ నెహ్రూ జయంతి వేడుకలు thumb ● బాలల హృదయాల్లో శాస్త్రీయ విజ్ఞానం, దేశభక్తిని నింపిన మహానేత జవహర్‌లాల్ నెహ్రూ thumb ● అయ్యప్ప మాలధారణ స్వీకరించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి thumb ● పంచాయతీ ఎన్నికల్లోనూ కూటమి అభ్యర్థులదే విజయం: ఎమ్మెల్యే బండారు సత్యానందరావు thumb ● సర్పంచ్ ఎన్నికల్లో చిలువూరి రామకృష్ణంరాజు విజయానికి కృషి చేయాలి
Test 4
Date of Publish : 14 November 2026, 01:52 pm
Posted by : SEETHA KIRAN KUMAR

యువకుడి వేధింపులు తట్టుకోలేక యువతి ఆత్మహత్య

తెలంగాణ
/ మహబూబ్ నగర్
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
14 Nov, 2026 - 01:52 PM
17 వీక్షణలు

తండ్రి మరణించినా కూలి పనులు చేస్తూ కూతురిని చదివిస్తున్న తల్లి.. మృతదేహం వద్ద గుండెలవిసేలా రోదించిన తల్లి

నారాయణపేట జిల్లా: ఉన్నత చదువులు చదివి ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న ఓ యువతి, యువకుడి వేధింపులతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నారాయణపేట జిల్లా జౌల్లాపురం గ్రామంలో విషాదాన్ని నింపింది. కూతురిని ఉన్నత చదువులు చదివించేందుకు కష్టపడుతున్న తల్లికి ఈ ఘటన తీరని శోకాన్ని మిగిల్చింది.

జౌల్లాపురం గ్రామానికి చెందిన హన్మంతు–వెంకటమ్మ దంపతుల కుమార్తె అనిత (23)ను వారు హైదరాబాద్‌లో డిగ్రీ చదివించారు. అయితే గత ఏడాది రోడ్డు ప్రమాదంలో తండ్రి హన్మంతు మరణించడంతో కుటుంబానికి పెద్ద దిక్కు లేకుండా పోయింది. అయినప్పటికీ అనిత చదువును కొనసాగించి ఉన్నత విద్య అభ్యసించాలనే పట్టుదలతో పీజీ కోర్సులో ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకుంది.

తండ్రి మరణించిన నేపథ్యంలో కుటుంబ ఆర్థిక పరిస్థితులు కష్టంగా మారడంతో, ఇకపై చదివించడం తన వల్ల కాదని, పెళ్లి చేస్తానని తల్లి వెంకటమ్మ చెప్పినట్లు సమాచారం. అయితే ప్రభుత్వ ఉద్యోగం సాధించే వరకు చదువుకుంటానని అనిత పట్టుబట్టడంతో, తల్లి కూలి పనులు చేస్తూ కూతురి చదువుకు అవసరమైన ఖర్చులు భరిస్తూ వస్తోంది.

ఈ క్రమంలో మహబూబ్‌నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం అమ్మాపూర్ గ్రామానికి చెందిన అనిల్ అనే వ్యక్తితో అనిత సన్నిహితంగా ఉండేదని స్థానికులు తెలిపారు. తనను వివాహం చేసుకోవాలని అనిల్ వేధించడంతో అతడిని దూరం పెట్టి చదువుపై దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. అయినప్పటికీ అనిల్ వేధింపులు కొనసాగినట్లు స్థానికులు చెబుతున్నారు.

ఈ వేధింపులతో తీవ్ర మనస్తాపానికి గురైన అనిత ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కూతురు మృతదేహాన్ని చూసిన తల్లి వెంకటమ్మ గుండెలవిసేలా రోదించింది. ప్రభుత్వ ఉద్యోగం సాధించే వరకు చదువుకుంటానని చెప్పిన బిడ్డ, తనను మధ్యలోనే వదిలి వెళ్లిపోయిందంటూ కన్నీరుమున్నీరైంది. కష్టపడి చదివిస్తున్న కూతురు ఇలా అర్ధంతరంగా తనకు దూరమైందని ఆమె విలపించిన తీరు అక్కడివారిని కలచివేసింది.

అనిత తల్లి వెంకటమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అనిల్‌పై కేసు నమోదు చేశారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. వేధింపుల ఆరోపణలపై పోలీసుల విచారణలో మరిన్ని వివరాలు వెల్లడికావాల్సి ఉంది.