BREAKING
thumb మూలపేటలో ఘనంగా శ్రీ గంగాలమ్మ తల్లి పండగకు ఏర్పాట్లు thumb ఎమ్మెల్యే వేముల వీరేశంను కలిసిన ఊరుమడ్ల గ్రామ నాయకులు thumb దుర్గానగర్ కాలనీలో ఘనంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు thumb దోర్నాల మండలానికి అందించిన సేవలు అభినందనీయం. thumb గ్రేటర్ నోయిడాలో ఘోర ప్రమాదం.. స్లీపర్ బస్సులో మంటలు.. thumb సంగారెడ్డి జిల్లాలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ పర్యటన thumb వాడపల్లి ఆలయంలో అభివృద్ధి పనులు ప్రారంభం thumb ర్యాలీ గ్రామంలో రూ.3.20 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం thumb దుర్గానగర్ కాలనీలో ఘనంగా గణేష్ నవరాత్రి సాంస్కృతిక వేడుకలు thumb తూర్పు గోదావరి జిల్లాలో పాఠశాలలకు రేపు సెలవు thumb మూలపేటలో ఘనంగా శ్రీ గంగాలమ్మ తల్లి పండగకు ఏర్పాట్లు thumb ఎమ్మెల్యే వేముల వీరేశంను కలిసిన ఊరుమడ్ల గ్రామ నాయకులు thumb దుర్గానగర్ కాలనీలో ఘనంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు thumb దోర్నాల మండలానికి అందించిన సేవలు అభినందనీయం. thumb గ్రేటర్ నోయిడాలో ఘోర ప్రమాదం.. స్లీపర్ బస్సులో మంటలు.. thumb సంగారెడ్డి జిల్లాలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ పర్యటన thumb వాడపల్లి ఆలయంలో అభివృద్ధి పనులు ప్రారంభం thumb ర్యాలీ గ్రామంలో రూ.3.20 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం thumb దుర్గానగర్ కాలనీలో ఘనంగా గణేష్ నవరాత్రి సాంస్కృతిక వేడుకలు thumb తూర్పు గోదావరి జిల్లాలో పాఠశాలలకు రేపు సెలవు
Date of Publish : 24 September 2026, 08:15 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

విద్యుత్ ఘాతానికి యువకుడి మృతి

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
24 Sep, 2026 - 08:15 AM
176 వీక్షణలు

విద్యుత్ ఘాతానికి యువకుడి మృతి పెనుగొలను సరిహద్దులో విషాద ఘటన.. 11 కేవీ తీగలు తగలడంతో ప్రమాదం

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామ సరిహద్దులోని మెట్టగుట్ట రోడ్డులో విద్యుత్ ఘాతానికి గురై చందర్లపాడు మండలం తోటరావుపాలెం గ్రామానికి చెందిన వేల్పుల రాజేష్ (23) మృతి చెందాడు. మంగళవారం రాత్రి జరిగిన ఈ ఘటనతో తోటరావుపాలెం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

గంపలగూడెం మండలం గోసవీడు గ్రామంలో నరికిన మామిడి కర్రను హైదరాబాద్‌కు తరలించేందుకు లారీలో లోడ్ చేశారు. అనంతరం లారీ పెనుగొలను గ్రామ సరిహద్దులోని మెట్టగుట్ట రహదారిపై వెళ్తుండగా, రోడ్డుపై ఉన్న 11 కేవీ విద్యుత్ తీగలు లారీలోని కర్రలకు తగిలాయి. దీంతో లారీ డ్రైవర్‌తో పాటు మరో ఇద్దరికి విద్యుత్ ప్రసరణ కావడంతో అప్రమత్తమైన వారు వెంటనే లారీ నుంచి కిందకు దూకారు.

లారీకి విద్యుత్ తీగలు అడ్డుగా ఉండటాన్ని గమనించిన రాజేష్ వాటిని తప్పించేందుకు ముందుకు వెళ్లాడు. లారీ ఆగిన తర్వాత తిరిగి వస్తూ విద్యుత్ తీగలో విద్యుత్ ప్రసరణ ఉన్న విషయం తెలియక దానిని పట్టుకున్నాడు. దీంతో ఒక్కసారిగా విద్యుత్ ఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదం జరిగిన తీరుతో అక్కడ ఉన్నవారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

ఈ ఘటనపై మృతుడి సోదరుడు గణేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గంపలగూడెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరువూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కూలి పనుల కోసం వెళ్లిన 23 ఏళ్ల యువకుడు అనూహ్యంగా విద్యుత్ ప్రమాదానికి బలికావడంతో తోటరావుపాలెంలో విషాదం నెలకొంది. రాజేష్ మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించగా, గ్రామస్థులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.