మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించాలి…
ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ఏలూరు నగర కార్యదర్శి అడ్డగర్ల లక్ష్మి ఇందిరా.
ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ఏలూరు నగర సమితి ముఖ్యుల సమావేశం అడ్డగర్ల లక్ష్మీ ఇందిర అధ్యక్షతన ఆర్.ఆర్.పేట స్ఫూర్తి భవన్ నందు జరిగినది.
ఈ సమావేశంలో పాల్గొన్న అడ్డగర్ల లక్ష్మీ ఇందిరా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో రాష్ట్ర మహిళలకు అనేక హామీలను ఇచ్చి సూపర్ సిక్స్ పథకాలను తీసుకువచ్చి మహిళా అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని అనేక వాగ్దానాలను చేశారని గుర్తు చేశారు. ఎన్నికలు పూర్తయి కొత్త ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తున్న మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందిందని విమర్శించారు. మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పథకాలను తక్షణమే అమలు చేయాలని ముఖ్యంగా రాష్ట్ర మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. మహిళా సమస్యల పరిష్కారం కోసం భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణ రూపొందించుకునేందుకు ఈనెల 24వ తారీఖు శనివారం ఏలూరు ఏరియా సమితి సమావేశం ఏర్పాటు చేశామని ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ఏలూరు నగర నిర్మాణ బాధ్యులు ఉప్పులూరి హేమ శంకర్, తదితరులు పాల్గొంటారని సమితి సభ్యులు సమయానికి హాజరయ్యి సమావేశం జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ఏలూరు నగర అధ్యక్షురాలు కొండేటి బేబీ మాట్లాడుతూ మహిళా సమాఖ్య మహిళల సమస్యల పరిష్కారం కోసం 70 ఏళ్లుగా దేశంలో అనేక పోరాటాలు నిర్వహించిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో మహిళలకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేయడానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించాలని డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో నగర ఉపాధ్యక్షురాలు గొర్లి స్వాతి నగర సమితి సభ్యులు ఉప్పులూరి లక్ష్మి భవాని తదితరులు పాల్గొన్నారు.