BREAKING
thumb ● తొట్టంబేడు ఎంపీపీ అభ్యర్థిగా కొన్నలి రమేష్ ఎంపిక thumb ● 40 ఏళ్ల టీడీపీ అనుబంధానికి స్వస్తి.. వైఎస్సార్‌సీపీలో చేరిన ఇర్లపాటి నరసయ్య thumb ● బాలల హక్కులకు భంగం కలిగించే ఉద్యోగులను శాశ్వతంగా తొలగించాలి thumb ● 1,105 మందికి చేయూత పింఛన్ల మంజూరు పత్రాలు అందజేత thumb ● వైసీపీకి రాజీనామా.. టీడీపీలో చేరిన రావులపాలెం మాజీ జెడ్పీటీసీ thumb ● ఖానాపూర్ మండలంలో వరి పంట కోత ప్రయోగం thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై అధికారులకు అవగాహన కార్యక్రమం thumb ● భవన నిర్మాణ కార్మికుల సెస్ నిధులను పక్కదారి పట్టిస్తే సహించేది లేదు thumb ● గార్లను కరువు మండలంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలి thumb ● పదవీ విరమణ అనంతరం శ్రీవారి సేవలో చంద్రారెడ్డి దంపతులు thumb ● తొట్టంబేడు ఎంపీపీ అభ్యర్థిగా కొన్నలి రమేష్ ఎంపిక thumb ● 40 ఏళ్ల టీడీపీ అనుబంధానికి స్వస్తి.. వైఎస్సార్‌సీపీలో చేరిన ఇర్లపాటి నరసయ్య thumb ● బాలల హక్కులకు భంగం కలిగించే ఉద్యోగులను శాశ్వతంగా తొలగించాలి thumb ● 1,105 మందికి చేయూత పింఛన్ల మంజూరు పత్రాలు అందజేత thumb ● వైసీపీకి రాజీనామా.. టీడీపీలో చేరిన రావులపాలెం మాజీ జెడ్పీటీసీ thumb ● ఖానాపూర్ మండలంలో వరి పంట కోత ప్రయోగం thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై అధికారులకు అవగాహన కార్యక్రమం thumb ● భవన నిర్మాణ కార్మికుల సెస్ నిధులను పక్కదారి పట్టిస్తే సహించేది లేదు thumb ● గార్లను కరువు మండలంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలి thumb ● పదవీ విరమణ అనంతరం శ్రీవారి సేవలో చంద్రారెడ్డి దంపతులు
Test 4
Date of Publish : 18 November 2026, 05:28 pm
Posted by : K MAHESH

వరంగల్ పశ్చిమలో 2,698 మందికి చేయూత ఆసరా పింఛన్లు

తెలంగాణ
/ హన్మకొండ
Reporter
K Mahesh Munugodu Constituency
18 Nov, 2026 - 05:28 PM
11 వీక్షణలు

కులం, మతం, రాజకీయాలకు అతీతంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలు: ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి

వరంగల్: అర్హతే ప్రామాణికంగా కులం, మతం, రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తెలిపారు. ప్రజాపాలనలో భాగంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.

వరంగల్‌లోని కాళోజీ కళాక్షేత్రంలో బుధవారం వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలో కొత్తగా అర్హత పొందిన 2,698 మంది లబ్ధిదారులకు చేయూత ఆసరా పింఛన్ల మంజూరు పత్రాలను ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, వరంగల్ ఎంపీ కడియం కావ్య పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్ ఖాన్, కుడా చైర్మన్ గుండు సుధారాణి, ఏనుమాముల మార్కెట్ చైర్మన్ పులి ప్రియాంక, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ వెంకన్న నాయక్, డిప్యూటీ కమిషనర్ బిర్రు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గతంలో సంక్షేమ పథకాల కోసం ప్రజలు ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేదని అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో అర్హులైన లబ్ధిదారులను గుర్తించి పింఛన్లు అందించే విధానానికి శ్రీకారం చుట్టారని గుర్తుచేశారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో డివిజన్‌కు పరిమిత సంఖ్యలోనే పింఛన్లు మంజూరు చేశారని విమర్శించారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం ఒకే రోజు 2,698 మందికి పింఛన్ మంజూరు పత్రాలు అందించడం ప్రజాపాలనకు నిదర్శనమని పేర్కొన్నారు.

సన్నబియ్యం పంపిణీ, ఇందిరమ్మ ఇళ్లు, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపు తదితర పథకాల ద్వారా ప్రజలకు ప్రయోజనం కల్పిస్తున్నామని తెలిపారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో ఇప్పటికే 5,500 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశామని, మిగిలిన అర్హులకు కూడా దశలవారీగా ఇళ్లు కేటాయిస్తామని చెప్పారు. ఇళ్ల స్థలం ఉన్న అర్హులకు ఇంటి నిర్మాణం కోసం రూ.5 లక్షల ఆర్థిక సాయం అందించే విధానం అమల్లో ఉందని వివరించారు.

పింఛన్లు, ఇతర సంక్షేమ పథకాల మంజూరులో రాజకీయ వివక్షకు తావులేదని, ఏ పార్టీకి చెందిన వారైనా అర్హత ఉంటే పథకాల ప్రయోజనాలు అందిస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. పింఛన్లు లేదా ఇతర పథకాల మంజూరు కోసం ఎవరైనా డబ్బులు అడిగితే సహించేది లేదని హెచ్చరించారు. దళారుల ప్రమేయం లేకుండా పథకాలు నేరుగా లబ్ధిదారులకు చేరాలని, డబ్బులు అడిగితే తన క్యాంపు కార్యాలయానికి లేదా స్థానిక ప్రజాప్రతినిధులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.

ఇంకా పింఛన్లు మంజూరు కాని అర్హులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, క్యాంపు కార్యాలయం, కలెక్టర్ కార్యాలయం లేదా మున్సిపల్ అధికారుల దృష్టికి సమస్యలను తీసుకువస్తే పరిశీలించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా చూస్తానని భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, వివిధ శాఖల అధికారులు, పింఛన్ లబ్ధిదారులు పాల్గొన్నారు.