హైదరాబాద్‌లో 36 గంటల పాటు నీటి సరఫరాకు అంతరాయం
హైదరాబాద్: నగరానికి తాగునీరు సరఫరా చేసే కృష్ణా డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్టు (KDWSP) ఫేజ్–IIలో భాగంగా పలు మరమ్మతు పనులు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. నాసర్లపల్లి నుంచి గోడకొండ్ల వరకు ఉన్న 2375 ఎంఎం డయా ఎంఎస్ పంపింగ్ మెయిన్‌పై దెబ్బతిన్న ఎంఎస్ ఎయిర్ టీస్, వాల్వుల మార్పిడి, స్కవర్ పైప్‌లైన్‌లో ఏర్పడిన లీకేజీ నివారణ పనులు చేపట్టనున్నారు.
ఈ పనులు అక్టోబర్ 5, 2026 సోమవారం ఉదయం 6 గంటల నుంచి అక్టోబర్ 6, 2026 మంగళవారం సాయంత్రం 6 గంటల వరకు మొత్తం 36 గంటల పాటు కొనసాగనున్నాయి. ఈ సమయంలో ఆయా ప్రాంతాల్లో తాగునీటి సరఫరా పూర్తిగా లేదా పాక్షికంగా నిలిచిపోవడంతో పాటు కొన్ని ప్రాంతాల్లో తక్కువ ఒత్తిడితో నీటి సరఫరా జరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
అంతరాయం ఏర్పడే ప్రాంతాలు:
ఆదిబట్ల, కమ్మగూడ, గుర్రంగూడ, బీఎన్ రెడ్డి నగర్, వనస్థలిపురం, ఆటోనగర్, అల్కాపురి, బీరప్పగడ్డ, హబ్సిగూడ, రామంతాపూర్, వెంకట్‌రెడ్డి నగర్, ఉప్పల్, నాచారం, హెచ్‌ఎంటీ నగర్, తార్నాక, బౌద్ధనగర్, లాలాపేట్ (పాక్షికం), హస్మత్‌పేట్, ప్రకాశ్‌నగర్, మేకలమండి, భోలక్‌పూర్ (పాక్షికం), పద్మారావునగర్, బేగంపేట్, సౌత్ సెంట్రల్ రైల్వే, ఎంఈఎస్, సికింద్రాబాద్ కంటోన్మెంట్, లాలాగూడ, అడ్డగుట్ట, పట్టిగడ్డ, నల్లగుట్ట, గౌతమ్‌నగర్, ఫిరోజ్‌గూడ, బన్సీలాల్‌పేట్, రాంగోపాల్‌పేట్, సీతాఫల్‌మండి, మెట్టుగూడ, వైశాలీనగర్, మీర్‌పేట్, బడంగ్‌పేట్, ఏఆర్‌సీఐ, బాలాపూర్, మైసారం, బార్కాస్, ఎన్‌పీఏ, శంషాబాద్, మధుబన్, ప్రశాసన్‌నగర్ (పాక్షికం).
అంతరాయం ఏర్పడనున్న ప్రాంతాల వినియోగదారులు ముందుగానే తగినంత నీటిని నిల్వ చేసుకుని, పనులు పూర్తయ్యే వరకు నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని అధికారులు సూచించారు.