BREAKING
thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన
Date of Publish : 06 August 2026, 02:31 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఆగస్టు 15లోపు గ్యాస్ కేవైసీ తప్పనిసరి – లేకపోతే సబ్సిడీ నిలిపివేత

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
06 Aug, 2026 - 02:31 PM
81 వీక్షణలు

ఆగస్టు 15లోపు గ్యాస్ కేవైసీ తప్పనిసరి – లేకపోతే సబ్సిడీ నిలిపివేత

ఖమ్మం జిల్లా, మధిర: గ్యాస్ వినియోగదారులందరూ ఆగస్టు 15లోపు తప్పనిసరిగా కేవైసీ పూర్తి చేసుకోవాలని మధిరలోని శ్రీ సాయి వెంకటేశ్వర హెచ్‌పీ గ్యాస్ ఏజెన్సీ డిస్ట్రిబ్యూటర్ దోసపాటి కళ్యాణి తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి గ్యాస్ కనెక్షన్‌దారు కేవైసీ చేయించుకోవాలని, లేనిపక్షంలో గ్యాస్ సిలిండర్ సరఫరాతో పాటు సబ్సిడీ కూడా నిలిచిపోయే అవకాశం ఉందని హెచ్చరించారు.

గత రెండేళ్లుగా కేంద్ర ప్రభుత్వం కేవైసీ పూర్తి చేయాలని సూచిస్తున్నప్పటికీ అనేక మంది వినియోగదారులు ఇంకా నిర్లక్ష్యం చేస్తున్నారని తెలిపారు. వినియోగదారులు తమ సమీప గ్యాస్ ఏజెన్సీ లేదా గ్యాస్ డెలివరీ సిబ్బంది వద్ద సులభంగా కేవైసీ చేయించుకోవచ్చన్నారు.

ఉజ్వల యోజన లబ్ధిదారులు కూడా తప్పనిసరిగా కేవైసీ పూర్తి చేయాలని, లేకపోతే వారికి అందుతున్న రూ.350 సబ్సిడీ నిలిపివేయబడే అవకాశం ఉందన్నారు. అలాగే కేవైసీ చేయని వినియోగదారులు ఆగస్టు 16 నుంచి కమర్షియల్ ధరలకు గ్యాస్ కొనుగోలు చేయాల్సి రావచ్చని, దీంతో ఒక్క సిలిండర్‌కు రూ.2,500 నుంచి రూ.3,000 వరకు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని వివరించారు.

ఈ విషయమై అధికారులు, డీలర్లు, సామాజిక మాధ్యమాలు, కరపత్రాల ద్వారా విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నప్పటికీ జిల్లాలో ఇంకా చాలామంది కేవైసీ పూర్తి చేయలేదని తెలిపారు. చివరి తేదీ కోసం వేచి చూడకుండా వెంటనే కేవైసీ పూర్తి చేసుకుని ఇబ్బందులను నివారించుకోవాలని వినియోగదారులకు విజ్ఞప్తి చేశారు.