BREAKING
thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్ thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్
Date of Publish : 18 May 2026, 04:57 pm
Posted by : కూనురు మధు

ఆస్తి కోసం అక్కను కడతేర్చిన తమ్ముడు

తెలంగాణ
/ సూర్యాపేట
18 May, 2026 - 04:57 PM
283 వీక్షణలు

NTODAY NEWS సూర్యాపేట :- కుటుంబ ఆస్తి తగాదాలు చివరకు ఓ మహిళ ప్రాణాలను బలితీసుకున్న ఘటన జిల్లాలో కలకలం రేపింది. ఆత్మకూరు (ఎస్) మండలం పరిధిలోని తుమ్మల పెన్ పహాడ్ గ్రామంలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

గ్రామానికి చెందిన సురుగు అంజమ్మ అనే మహిళను ఆమె సొంత తమ్ముడు ఆస్తి వివాదాల కారణంగా దారుణంగా హత్య చేసినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. కుటుంబానికి సంబంధించిన భూమి, ఆస్తుల విషయంలో కొంతకాలంగా అన్నాచెల్లెళ్ల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయని సమాచారం. ఈ క్రమంలో తలెత్తిన గొడవ తీవ్రరూపం దాల్చడంతో ఆగ్రహానికి గురైన తమ్ముడు అంజమ్మపై దాడి చేసినట్లు తెలిసింది.

దాడిలో తీవ్రంగా గాయపడిన అంజమ్మ అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. ఘటన తెలిసిన వెంటనే గ్రామస్తులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఆస్తి కోసం సొంత అక్కను కూడా కడతేర్చే స్థాయికి దిగజారడం దారుణమని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకోగా, మృతురాలి కుటుంబ సభ్యుల రోదనలు హృదయ విదారకంగా మారాయి.