BREAKING
thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● కీసరలో నూతన రేషన్ కార్డుల పంపిణీ thumb ● నంద్యాలలో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష thumb ● అల్లగడ్డలో చెత్తబుట్టలో మృత శిశువు కలకలం thumb ● ఐదు గ్రామపంచాయతీలకు టీబీ ముక్త్ పంచాయతీ గుర్తింపు thumb ● చిల్లాపురం రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నూతన కమిటీ ఎన్నిక thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● కీసరలో నూతన రేషన్ కార్డుల పంపిణీ thumb ● నంద్యాలలో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష thumb ● అల్లగడ్డలో చెత్తబుట్టలో మృత శిశువు కలకలం thumb ● ఐదు గ్రామపంచాయతీలకు టీబీ ముక్త్ పంచాయతీ గుర్తింపు thumb ● చిల్లాపురం రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నూతన కమిటీ ఎన్నిక
Date of Publish : 04 July 2026, 09:33 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చైర్మన్ రేసులో ఎవరికి ఛాన్స్?

తెలంగాణ
/ మహబూబాబాద్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
04 Jul, 2026 - 09:33 PM
143 వీక్షణలు

మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం పొగుళ్లపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (ప్యాక్స్) చైర్మన్ పదవిపై రాజకీయ ఉత్కంఠ నెలకొంది. సహకార సంఘాల ఎన్నికల ప్రక్రియలో జాప్యం చోటుచేసుకోవడంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుని, ప్రస్తుత సంఘాలకు నామినేటెడ్ ఇన్‌ఛార్జి కమిటీల నియామకానికి ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రతి కమిటీలో ఒక చైర్‌పర్సన్‌తో పాటు 12 మంది సభ్యులు ఉంటారు. వీరు ఆరు నెలల పాటు లేదా ఎన్నికలు జరిగే వరకు బాధ్యతలు నిర్వహించనున్నారు.
ఈ నేపథ్యంలో పొగుళ్లపల్లి ప్యాక్స్ చైర్మన్ పదవిని దక్కించుకునేందుకు మండలానికి చెందిన పలువురు నాయకులు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, సహకార సంఘాల్లో పారదర్శకతకు ప్రాధాన్యం ఇవ్వాలని, అర్హులైన వారికే అవకాశం కల్పించాలని మంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.
మంత్రి ఆదేశాలు, పార్టీ అధిష్టానం వైఖరి నేపథ్యంలో ఈ కీలక పదవి ఎవరికి దక్కనుందనే దానిపై మండలంలో ఆసక్తికర చర్చ సాగుతోంది. ఎన్నికలు జరిగే వరకు ఈ పదవిని చేపట్టడం ద్వారా తమ రాజకీయ పట్టును మరింత బలోపేతం చేసుకోవాలని ఆశిస్తున్న నాయకులు అధిష్టానం తుది నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు.