BREAKING
thumb ● ఉరుమడ్లలో అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న కంచర్ల భూపాల్ రెడ్డి thumb ● పుదిపట్లలో వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా దసరా నవరాత్రి ఉత్సవాలు thumb ● మధుసూదనాచారి జన్మదినం సందర్భంగా రెడీ టు సర్వ్ ఫౌండేషన్ లో సేవా కార్యక్రమాలు thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● ఉరుమడ్లలో అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న కంచర్ల భూపాల్ రెడ్డి thumb ● పుదిపట్లలో వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా దసరా నవరాత్రి ఉత్సవాలు thumb ● మధుసూదనాచారి జన్మదినం సందర్భంగా రెడీ టు సర్వ్ ఫౌండేషన్ లో సేవా కార్యక్రమాలు thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం
Date of Publish : 13 October 2026, 04:05 pm
Posted by : SEETHA KIRAN KUMAR

రూ.20 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, మండల సర్వేయర్

తెలంగాణ
/ రంగారెడ్డి
Reporter
Seetha Kiran Kumar Hanmakonda Mandal
13 Oct, 2026 - 04:05 PM
2 వీక్షణలు

హైదరాబాద్‌: జాయింట్ ఇన్‌స్పెక్షన్ సర్వే రిపోర్టు జారీ చేసేందుకు రూ.20 లక్షలు లంచం తీసుకుంటున్న సమయంలో అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ బి. సుదర్శన్ రెడ్డి, మండల సర్వేయర్ బతుక శ్రీనివాసులు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు చిక్కినట్లు సమాచారం.

హెచ్‌ఎండీఏ నిబంధనల ప్రకారం సర్వే నిర్వహించి జాయింట్ ఇన్‌స్పెక్షన్ సర్వే రిపోర్టు అందించేందుకు తొలుత రూ.30 లక్షలు డిమాండ్ చేసినట్లు, అనంతరం రూ.20 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఏసీబీ వెల్లడించింది.

తహసీల్దార్ సుదర్శన్ రెడ్డి సూచనల మేరకు ఫిర్యాదుదారుడి నుంచి లంచం తీసుకుంటున్న సమయంలో అబ్దుల్లాపూర్‌మెట్ సమీపంలో మండల సర్వేయర్‌ను ఏసీబీ అధికారులు పట్టుకున్నట్లు తెలిపింది. ఆయన వద్ద నుంచి రూ.20 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది. నిర్వహించిన రసాయన పరీక్షల్లో సర్వేయర్ చేతులకు పాజిటివ్ ఫలితం వచ్చినట్లు ఏసీబీ వెల్లడించింది.

ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసి నాంపల్లిలోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నట్లు సమాచారం. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.

ప్రభుత్వ కార్యాలయాల్లో ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్ 1064కు లేదా వాట్సాప్ నంబర్ 9440446106కు ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు.