నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి
ఆంధ్రప్రదేశ్
/
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ
ఎనిమిది మంది అరెస్ట్.. రూ.15,100 నగదు స్వాధీనం
ఆత్రేయపురం: మండలంలోని నార్కెడిమిల్లి గ్రామ శివారులో నిర్వహిస్తున్న పేకాట శిబిరంపై సోమవారం పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పేకాట ఆడుతున్న ఎనిమిది మందిని అరెస్టు చేసి, వారి వద్ద నుంచి రూ.15,100 నగదును స్వాధీనం చేసుకున్నారు.
అనంతరం నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు స్టేషన్ హౌస్ ఆఫీసర్, ఏఎస్ఐ బి. శ్రీనివాసరావు తెలిపారు. చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.