BREAKING
thumb ● రొంపిచర్లలో వైసీపీకి ఆధిక్యం.. 14 వార్డుల్లో 12 కైవసం thumb ● సంతగుడిపాడు 9వ వార్డు సభ్యుడిగా సీపీఐ అభ్యర్థి కోట నాగయ్య విజయం thumb ● కల్వల గ్రామంలో సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ thumb ● ప్రజాస్వామ్య పరిరక్షణకు రాజ్యాంగాన్ని కాపాడుకుందాం thumb ● బిజెపి ఆధ్వర్యంలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు thumb ● పింఛన్ దారుల ఖాతాల్లో నగదు జమ యువజన కాంగ్రెస్ హర్షం thumb ● 24 శాఖల ప్రగతిపై సమీక్ష ఉత్తమ సర్పంచులకు సన్మానం thumb ● ట్రాక్టర్‌ను ఢీకొన్న ద్విచక్రవాహనం ఒకరు మృతి, మరొకరికి తీవ్రగాయాలు thumb ● వివాహ వేడుకల్లో పాల్గొన్న రమేష్ గౌడ్ thumb ● ఎల్కతుర్తి పోలీస్‌స్టేషన్‌ను వార్షికంగా తనిఖీ చేసిన ఏసీపీ ప్రశాంత్ రెడ్డి thumb ● రొంపిచర్లలో వైసీపీకి ఆధిక్యం.. 14 వార్డుల్లో 12 కైవసం thumb ● సంతగుడిపాడు 9వ వార్డు సభ్యుడిగా సీపీఐ అభ్యర్థి కోట నాగయ్య విజయం thumb ● కల్వల గ్రామంలో సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ thumb ● ప్రజాస్వామ్య పరిరక్షణకు రాజ్యాంగాన్ని కాపాడుకుందాం thumb ● బిజెపి ఆధ్వర్యంలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు thumb ● పింఛన్ దారుల ఖాతాల్లో నగదు జమ యువజన కాంగ్రెస్ హర్షం thumb ● 24 శాఖల ప్రగతిపై సమీక్ష ఉత్తమ సర్పంచులకు సన్మానం thumb ● ట్రాక్టర్‌ను ఢీకొన్న ద్విచక్రవాహనం ఒకరు మృతి, మరొకరికి తీవ్రగాయాలు thumb ● వివాహ వేడుకల్లో పాల్గొన్న రమేష్ గౌడ్ thumb ● ఎల్కతుర్తి పోలీస్‌స్టేషన్‌ను వార్షికంగా తనిఖీ చేసిన ఏసీపీ ప్రశాంత్ రెడ్డి
Test 4
Date of Publish : 27 November 2026, 11:57 am
Posted by : GODAVARTHI VENKATA SAI TEJA

సంతగుడిపాడు 9వ వార్డు సభ్యుడిగా సీపీఐ అభ్యర్థి కోట నాగయ్య విజయం

ఆంధ్రప్రదేశ్
/ పల్నాడు
27 Nov, 2026 - 11:57 AM
7 వీక్షణలు

10 ఓట్ల మెజారిటీతో గెలుపు.. నాగయ్యకు సీపీఐ నాయకుల అభినందనలు, సన్మానం

రొంపిచర్ల | నవంబర్ 27:

మండలంలోని సంతగుడిపాడు గ్రామంలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 9వ వార్డు సభ్యుడిగా సీపీఐ అభ్యర్థి కోట నాగయ్య విజయం సాధించారు. ఈ నెల 26న జరిగిన ఎన్నికల్లో వైసీపీ బలపరిచిన సీపీఐ అభ్యర్థిగా పోటీ చేసిన నాగయ్య తన ప్రత్యర్థిపై 10 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

కోట నాగయ్య ప్రస్తుతం సీపీఐ సంతగుడిపాడు గ్రామ శాఖ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గతంలో గ్రామంలో సీపీఐ నాయకులు చేసిన పోరాటాల ఫలితంగా పేద, బడుగు, బలహీన వర్గాలకు ఇళ్ల స్థలాల పంపిణీ జరిగిందని, వారికి పక్కా గృహాల నిర్మాణానికి కూడా పార్టీ నాయకులు కృషి చేశారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

నాగయ్యకు నాయకుల అభినందనలు

9వ వార్డు సభ్యుడిగా విజయం సాధించిన కోట నాగయ్యను సీపీఐ రాష్ట్ర నాయకులు వై. చెంచయ్య, జిల్లా సహాయ కార్యదర్శి కాసా రాంబాబు, ఏరియా కార్యదర్శి చక్రవరం సత్యనారాయణరాజు, జిల్లా నాయకులు ఉప్పలపాటి రంగయ్య, రైతు సంఘం నాయకులు నాగేశ్వరరావు, డి. బ్రహ్మారెడ్డి, మండల కార్యదర్శి రొడ్డా అంజిరెడ్డి, మండల నాయకులు పిడెం హుస్సేన్, బ్రహ్మయ్య, వెంకట్రావు తదితరులు అభినందించారు.

అనంతరం కోట నాగయ్యను నాయకులు ఘనంగా సన్మానించారు.