BREAKING
thumb ● రొంపిచర్లలో వైసీపీకి ఆధిక్యం.. 14 వార్డుల్లో 12 కైవసం thumb ● సంతగుడిపాడు 9వ వార్డు సభ్యుడిగా సీపీఐ అభ్యర్థి కోట నాగయ్య విజయం thumb ● కల్వల గ్రామంలో సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ thumb ● ప్రజాస్వామ్య పరిరక్షణకు రాజ్యాంగాన్ని కాపాడుకుందాం thumb ● బిజెపి ఆధ్వర్యంలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు thumb ● పింఛన్ దారుల ఖాతాల్లో నగదు జమ యువజన కాంగ్రెస్ హర్షం thumb ● 24 శాఖల ప్రగతిపై సమీక్ష ఉత్తమ సర్పంచులకు సన్మానం thumb ● ట్రాక్టర్‌ను ఢీకొన్న ద్విచక్రవాహనం ఒకరు మృతి, మరొకరికి తీవ్రగాయాలు thumb ● వివాహ వేడుకల్లో పాల్గొన్న రమేష్ గౌడ్ thumb ● ఎల్కతుర్తి పోలీస్‌స్టేషన్‌ను వార్షికంగా తనిఖీ చేసిన ఏసీపీ ప్రశాంత్ రెడ్డి thumb ● రొంపిచర్లలో వైసీపీకి ఆధిక్యం.. 14 వార్డుల్లో 12 కైవసం thumb ● సంతగుడిపాడు 9వ వార్డు సభ్యుడిగా సీపీఐ అభ్యర్థి కోట నాగయ్య విజయం thumb ● కల్వల గ్రామంలో సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ thumb ● ప్రజాస్వామ్య పరిరక్షణకు రాజ్యాంగాన్ని కాపాడుకుందాం thumb ● బిజెపి ఆధ్వర్యంలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు thumb ● పింఛన్ దారుల ఖాతాల్లో నగదు జమ యువజన కాంగ్రెస్ హర్షం thumb ● 24 శాఖల ప్రగతిపై సమీక్ష ఉత్తమ సర్పంచులకు సన్మానం thumb ● ట్రాక్టర్‌ను ఢీకొన్న ద్విచక్రవాహనం ఒకరు మృతి, మరొకరికి తీవ్రగాయాలు thumb ● వివాహ వేడుకల్లో పాల్గొన్న రమేష్ గౌడ్ thumb ● ఎల్కతుర్తి పోలీస్‌స్టేషన్‌ను వార్షికంగా తనిఖీ చేసిన ఏసీపీ ప్రశాంత్ రెడ్డి
Test 4
Date of Publish : 27 November 2026, 11:33 am
Posted by : THALLAPALLI LAKSHMANA

హుస్సేన్‌పురం సర్పంచి ఓట్ల లెక్కింపులో గందరగోళం

ఆంధ్రప్రదేశ్
/ మార్కాపురం / వెలిగండ్ల
Reporter
Thallapalli Lakshmana ప్రకాశం జిల్లా స్టాఫ్ రిపోర్టర్
27 Nov, 2026 - 11:33 AM
11 వీక్షణలు

17 ఓట్ల మెజార్టీతో వైసీపీ అభ్యర్థి గెలిచినట్లు సమాచారం.. బ్యాలెట్ పత్రాలు చించివేశారంటూ వైసీపీ శ్రేణుల ఆరోపణ

ప్రకాశం జిల్లా | వెలిగండ్ల మండలం | హుస్సేన్‌పురం:

వెలిగండ్ల మండలం హుస్సేన్‌పురం గ్రామపంచాయతీ సర్పంచి ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా తీవ్ర గందరగోళం నెలకొంది. సర్పంచి ఓట్ల లెక్కింపులో వైసీపీ అభ్యర్థి తమ్మినేని గురవమ్మ 17 ఓట్ల మెజార్టీతో విజయం సాధించినట్లు సమాచారం. అయితే ఫలితాల ప్రకటన, డిక్లరేషన్ ఫారం జారీ విషయంలో వివాదం తలెత్తినట్లు తెలుస్తోంది.

గ్రామపంచాయతీలోని మొత్తం 10 వార్డుల్లో ఏడు వార్డులను వైసీపీ, రెండు వార్డులను టీడీపీ గెలుచుకున్నట్లు సమాచారం. మరో వార్డు ఏకగ్రీవమైనట్లు తెలిసింది.

బ్యాలెట్ పత్రాలు చించివేశారంటూ ఆరోపణలు

ఓట్ల లెక్కింపు సమయంలో సర్పంచి అభ్యర్థి ఫలితంపై వివాదం చోటుచేసుకున్నట్లు సమాచారం. ఓటమిని అంగీకరించలేక టీడీపీ నాయకులు కౌంటింగ్ కేంద్రంలో విద్యుత్ సరఫరా నిలిపివేయించి బ్యాలెట్ పత్రాలను చించివేశారని వైసీపీ శ్రేణులు ఆరోపించాయి. ఎన్నికల అధికారి డిక్లరేషన్ ఫారం ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని పేర్కొంటూ వైసీపీ నాయకులు నిరసనకు దిగారు.

కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత

ఈ విషయం తెలుసుకున్న కనిగిరి వైసీపీ ఇన్‌చార్జి డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ కౌంటింగ్ కేంద్రానికి చేరుకుని ఎన్నికల అధికారిని ప్రశ్నించారు. ఈ క్రమంలో ఆయనను బయటకు పంపించేందుకు పోలీసులు ప్రయత్నించగా, గ్రామస్తులు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి డీఎస్పీ శ్రీనివాసరావు అదనపు పోలీసు బలగాలను రప్పించారు. దీంతో కౌంటింగ్ కేంద్రం పరిసరాల్లో కొంతసేపు తీవ్ర గందరగోళం నెలకొంది.

అయితే బ్యాలెట్ పత్రాల ధ్వంసం, విద్యుత్ సరఫరా నిలిపివేత, ఫలితాల ప్రకటనకు సంబంధించిన ఆరోపణలపై అధికారిక వివరణ వెలువడాల్సి ఉంది. ఎన్నికల అధికారి ప్రకటించిన తుది ఫలితం, సంబంధిత అధికారుల స్పందన తెలియాల్సి ఉంది.