BREAKING
thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు
Date of Publish : 13 October 2026, 07:00 am
Posted by : NTODAY NEWS

సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
NTODAY NEWS ప్రతి క్షణం - ప్రజల పక్షం
13 Oct, 2026 - 07:00 AM
17 వీక్షణలు

ఢిల్లీలో కాంగ్రెస్‌ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఉప్పల శ్రీనివాస్‌ గుప్త

న్యూఢిల్లీ, అక్టోబర్‌ 12 (ఎన్‌ టుడే న్యూస్‌): ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ) జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఢిల్లీలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఉప్పల శ్రీనివాస్‌ గుప్త పాల్గొన్నారు.

ఢిల్లీలోని తెలంగాణ భవన్‌ నుంచి బారాఖంబా మీదుగా సుప్రీంకోర్టు వరకు నిర్వహించిన నిరసన ప్రదర్శనలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు బి. మహేష్‌ కుమార్‌ గౌడ్‌తో పాటు పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులతో కలిసి ఉప్పల శ్రీనివాస్‌ గుప్త పాల్గొని నిరసన తెలిపారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

ప్రజాస్వామ్య పరిరక్షణ, ఎన్నికల వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించడం, ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతను కాపాడటం వంటి అంశాలపై కాంగ్రెస్‌ పార్టీ తన నిరసనను వ్యక్తం చేసింది.

ఈ సందర్భంగా ఉప్పల శ్రీనివాస్‌ గుప్త కాంగ్రెస్‌ నాయకులు, ప్రజాప్రతినిధులతో కలిసి ఎన్నికల వ్యవస్థలో పారదర్శకత, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం పార్టీ చేపట్టిన ఆందోళనకు సంఘీభావం తెలిపారు.