BREAKING
thumb ● రొంపిచర్లలో వైసీపీకి ఆధిక్యం.. 14 వార్డుల్లో 12 కైవసం thumb ● సంతగుడిపాడు 9వ వార్డు సభ్యుడిగా సీపీఐ అభ్యర్థి కోట నాగయ్య విజయం thumb ● కల్వల గ్రామంలో సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ thumb ● ప్రజాస్వామ్య పరిరక్షణకు రాజ్యాంగాన్ని కాపాడుకుందాం thumb ● బిజెపి ఆధ్వర్యంలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు thumb ● పింఛన్ దారుల ఖాతాల్లో నగదు జమ యువజన కాంగ్రెస్ హర్షం thumb ● 24 శాఖల ప్రగతిపై సమీక్ష ఉత్తమ సర్పంచులకు సన్మానం thumb ● ట్రాక్టర్‌ను ఢీకొన్న ద్విచక్రవాహనం ఒకరు మృతి, మరొకరికి తీవ్రగాయాలు thumb ● వివాహ వేడుకల్లో పాల్గొన్న రమేష్ గౌడ్ thumb ● ఎల్కతుర్తి పోలీస్‌స్టేషన్‌ను వార్షికంగా తనిఖీ చేసిన ఏసీపీ ప్రశాంత్ రెడ్డి thumb ● రొంపిచర్లలో వైసీపీకి ఆధిక్యం.. 14 వార్డుల్లో 12 కైవసం thumb ● సంతగుడిపాడు 9వ వార్డు సభ్యుడిగా సీపీఐ అభ్యర్థి కోట నాగయ్య విజయం thumb ● కల్వల గ్రామంలో సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ thumb ● ప్రజాస్వామ్య పరిరక్షణకు రాజ్యాంగాన్ని కాపాడుకుందాం thumb ● బిజెపి ఆధ్వర్యంలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు thumb ● పింఛన్ దారుల ఖాతాల్లో నగదు జమ యువజన కాంగ్రెస్ హర్షం thumb ● 24 శాఖల ప్రగతిపై సమీక్ష ఉత్తమ సర్పంచులకు సన్మానం thumb ● ట్రాక్టర్‌ను ఢీకొన్న ద్విచక్రవాహనం ఒకరు మృతి, మరొకరికి తీవ్రగాయాలు thumb ● వివాహ వేడుకల్లో పాల్గొన్న రమేష్ గౌడ్ thumb ● ఎల్కతుర్తి పోలీస్‌స్టేషన్‌ను వార్షికంగా తనిఖీ చేసిన ఏసీపీ ప్రశాంత్ రెడ్డి
Test 4
Date of Publish : 27 November 2026, 11:56 am
Posted by : SEETHA KIRAN KUMAR

ఎస్‌ఐ ప్రిలిమినరీ పరీక్ష నేపథ్యంలో వాకర్స్‌కు పోలీసుల సూచన

తెలంగాణ
/ హన్మకొండ
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
27 Nov, 2026 - 11:56 AM
8 వీక్షణలు

నవంబర్ 28 సాయంత్రం 6 గంటల నుంచి 29 ఉదయం వరకు ఆరు పరీక్షా కేంద్రాల మైదానాల్లో వాకింగ్‌కు అనుమతి లేదు

వరంగల్ | నవంబర్ 27:

తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి (TSLPRB) ఆధ్వర్యంలో ఈ నెల 29న (ఆదివారం) సబ్‌ఇన్‌స్పెక్టర్ (ఎస్‌ఐ) ఉద్యోగాల నియామకానికి ప్రిలిమినరీ రాత పరీక్ష నిర్వహించనున్నారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ ట్రై సిటీ పరిధిలోని 32 పరీక్షా కేంద్రాల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష జరగనుంది.

పరీక్షల నిర్వహణ, భద్రతా ఏర్పాట్ల దృష్ట్యా పరీక్షా కేంద్రాలుగా ఎంపికైన కళాశాలలు, పాఠశాలల మైదానాల్లో వాకర్స్‌కు తాత్కాలికంగా అనుమతి ఉండదని పోలీస్ శాఖ వెల్లడించింది.

ఆరు కేంద్రాల మైదానాల్లో వాకింగ్‌కు అనుమతి లేదు

ఈ నెల 28వ తేదీ (శనివారం) సాయంత్రం 6 గంటల నుంచి 29వ తేదీ (ఆదివారం) ఉదయం వరకు కింది పరీక్షా కేంద్రాల మైదానాల్లో వాకింగ్‌కు రావద్దని ట్రై సిటీ పరిధిలోని వాకర్స్‌కు సూచించారు.

  1. సెయింట్ గాబ్రియేల్ హైస్కూల్, కాజీపేట.

  2. ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల, హనుమకొండ.

  3. కాకతీయ డిగ్రీ కళాశాల, హనుమకొండ.

  4. కాకతీయ యూనివర్సిటీ క్యాంపస్.

  5. లాల్ బహదూర్ కళాశాల, వరంగల్.

  6. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, వరంగల్.

పోలీస్ శాఖకు సహకరించాలి: సీపీ ఎన్. శ్వేత

ఎస్‌ఐ ప్రిలిమినరీ పరీక్షలు ప్రశాంతంగా, సజావుగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ చేపడుతున్న భద్రతా చర్యలకు వాకర్స్‌తో పాటు ప్రజలందరూ సహకరించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్ విజ్ఞప్తి చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసుల సూచనలను పాటించాలని కోరారు.