BREAKING
thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ
Date of Publish : 02 May 2026, 11:40 am
Posted by : BATHULA VENKATESH

అద్దె ఇంటి నెపంతో మోసం బంగారం దొంగతనం కేసులో నిందితుడికి 5 నెలల జైలు శిక్ష ​

ఆంధ్రప్రదేశ్
/ అనకాపల్లి
Reporter
Bathula venkatesh నక్కపల్లి మండల ప్రతినిధి
02 May, 2026 - 11:40 AM
156 వీక్షణలు

అద్దె ఇంటి నెపంతో మోసం బంగారం దొంగతనం కేసులో నిందితుడికి 5 నెలల జైలు శిక్ష 

​ అనకాపల్లి పట్టణ పరిధిలో ఇల్లు అద్దెకు తీసుకుంటానని నమ్మించి, చాకచక్యంగా బంగారం దొంగిలించిన కేసులో నిందితుడికి గౌరవ న్యాయస్థానం శిక్ష ఖరారు చేసింది. నిందితుడిపై మోపబడిన నేరం నిరూపితం కావడంతో 5 నెలల కఠిన కారాగార శిక్ష మరియు జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది.

సంఘటన నేపథ్యం: ​గత ఏడాది డిసెంబర్ 10, 2025న అనకాపల్లిలోని కర్ణాల వీధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. నిందితుడు తాను సచివాలయం ఉద్యోగినని పరిచయం చేసుకుని, ఇల్లు అద్దెకు కావాలని బాధితురాలిని నమ్మించాడు. ఫోటోలు తీయాలనే నెపంతో ఆమెను ఏమార్చి, పక్కన పెట్టిన రెండు పేటల బంగారు త్రాడును దొంగిలించి పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు అనకాపల్లి పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

నిందితుడి వివరాలు: 

పేరు: యల్లమిల్లి వెంకటనారాయణ @ కిషోర్ (42) 

​తండ్రి పేరు: అర్జునరావు

​నివాసం: శివకోడపాలెం గ్రామం, రాజోలు మండలం, బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా.

కోర్టు తీర్పు: 

​ఈ కేసును విచారించిన గౌరవ XI అదనపు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ శ్రీ ఏ.రమేష్ గారు, సాక్ష్యాధారాలను పరిశీలించిన అనంతరం నిందితుడికి:

​5 నెలల సాధారణ జైలు శిక్ష

​₹5,000 జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు.

​ఈ కేసులో నిందితుడిని పట్టుకోవడంలో మరియు సరైన సాక్ష్యాధారాలను కోర్టుకు సమర్పించడంలో ఎస్.ఐ. కె.పోషణ గౌరి, ఎస్.ఐ. కె.సంతోష్ కుమార్ లు కీలక పాత్ర పోషించారు. నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన అధికారులను ఉన్నతాధికారులు అభినందించారు.

ప్రజలకు విజ్ఞప్తి: 

అపరిచిత వ్యక్తులు, తాము ప్రభుత్వ ఉద్యోగులమని లేదా ఇతర హోదాల్లో ఉన్నామని చెప్పి ఇళ్ల వద్దకు వస్తే అప్రమత్తంగా ఉండాలి. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే స్థానిక పోలీసులకు లేదా డయల్ 100/112 కు సమాచారం అందించవలసిందిగా కోరుతున్నాము.