BREAKING
thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన
Date of Publish : 20 June 2026, 06:23 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఏపీ లో ప్రభుత్వ పాఠశాలల్లో చిరుధాన్యాల చిక్కీలు – విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
20 Jun, 2026 - 06:23 AM
117 వీక్షణలు

అమరావతి: ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పోషకాహారంలో కొత్త మార్పులు తీసుకొచ్చింది. ఇప్పటివరకు వేరుశనగతో తయారైన చిక్కీలు అందిస్తున్న ప్రభుత్వం, ఇకపై చిరుధాన్యాలు కలిపిన ప్రత్యేక చిక్కీలను కూడా సరఫరా చేయడం ప్రారంభించింది.

వేరుశనగ, బెల్లం, జొన్న, సజ్జల వంటి చిరుధాన్యాలతో తయారైన ఈ కొత్త చిక్కీలు ఇప్పటికే పాఠశాలలకు పంపిణీ చేశారు. పిల్లల ఆహారంలో పోషక విలువలు పెంచడం, ఆరోగ్యాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సూచనల మేరకు చిరుధాన్యాలను విద్యార్థుల రోజువారీ ఆహారంలో భాగం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని విస్తరించారు.

మధ్యాహ్న భోజన పథకం విభాగం డైరెక్టర్ బి.నివాసరావు తెలిపిన ప్రకారం, భవిష్యత్తులో మరిన్ని పోషకాహార మార్పులు తీసుకురావాలని శాఖ లక్ష్యంగా పెట్టుకుంది.