నేటి నుంచి పెరగనున్న విమాన చార్జీలు
జాతీయం
దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణికులపై ఇంధన సర్‌చార్జి భారం పెరగనుంది. దేశీయ విమాన టికెట్లపై రూ.100 నుంచి రూ.350 వరకు అదనపు సర్‌చార్జి విధించనున్నట్లు సమాచారం.
అంతర్జాతీయ విమాన ప్రయాణాల్లో దూరాన్ని బట్టి సర్‌చార్జి పెంపు వర్తించనుంది. 500 కిలోమీటర్ల వరకు రూ.375, 501 నుంచి 1,000 కిలోమీటర్ల వరకు రూ.600, 1,001 నుంచి 1,500 కిలోమీటర్ల వరకు రూ.900, 1,501 నుంచి 2,000 కిలోమీటర్ల వరకు రూ.1,150, 2,000 కిలోమీటర్లకు పైబడిన దూరాలకు రూ.1,300 చొప్పున ఇంధన సర్‌చార్జి పెరగనుంది.
ఈ పెంపుతో దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణాల టికెట్ ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది.