BREAKING
​SBIలో 12,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్: ఛైర్మన్ పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​ 20న గుంటూరులో యోగా పోటీలు ..... పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ​SBIలో 12,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్: ఛైర్మన్ పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​ 20న గుంటూరులో యోగా పోటీలు ..... పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు
Date of Publish : 18 June 2025, 07:17 pm
Posted by : NTODAY NEWS OFFICIAL

అంబేద్కర్ అభయ హస్తం పథకాన్ని అమలు చేయాలి

తెలంగాణ
18 Jun, 2025 - 07:17 PM
299 వీక్షణలు
స్ధానిక సంస్థల ఎన్నికలకు ముందే అంబేద్కర్ అభయ హస్తం పథకాన్ని అమలు చేయాలి. దళిత గిరిజన ఆదివాసి జె.ఏ.సి నాయకుడు ముత్యాపాగ నరసింగరావు మాదిగ అంబేద్కర్ అభయ హస్తం పథకం తక్షణమే ప్రారంభించి కాంగ్రెస్ ప్రభుత్వం తమ చిత్తశుద్ధిని చాటుకోవాలని జేఏసీ నాయకులు ముఖ్యపాగ నరసింగరావు మాదిగ డిమాండ్ చేశారు. అయన మాట్లాడుతూ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ చేవెళ్లలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో చేవెళ్ల డిక్లరేషన్ పేరుతో 12 అంశాలతో కూడిన వాగ్దానాలను చేయడం జరిగినదన్నారు. అందులో ముఖ్యంగా SC,ST కుటుంబాలకు కుటుంబానికి 12 లక్షల రూపాయలు అందిస్తామని కాంట్రాక్ట్ పనులలో ఎస్సీ ఎస్టీ లకు రిజర్వేషనులు, పోడు భూముల కు పట్టాలు, ఎస్టీలకు 3, ఎస్సీలకు 3 కార్పొరేషన్ల ఏర్పాటు, ఎస్సీలకు 18 శాతం, ఎస్టీలకు 12 శాతం రిజర్వేషన్లు ఇలా 12 అంశాలతో తెలంగాణ రాష్ట్రంలోని దళిత గిరిజన ఆదివాసి ప్రజల అభివృద్ధికోసం మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వంద రోజుల్లో అమలు చేస్తామని తెలిపారన్నారు. ఇప్పటికీ ప్రభుత్వంలోకి వచ్చి 18 నెలలు గడిచినప్పటికీ అంబేద్కర్ అభయ హస్తం పథకాన్ని అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది కాబట్టే ఈ స్ధానిక సంస్థల ఎన్నికలకు ముందే అంబేద్కర్ అభయ హస్తం పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని రావడానికే ఈ నెల 26 న హైదరాబాద్ లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ నందు రౌండ్ టేబుల్ సమావేశం ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రం లో ఉన్న దళిత గిరిజన ఆదివాసి సంఘాల నాయకులు, ప్రొఫెసర్లు, డాక్టర్లు, మేధావులు,ప్రజాస్వామిక వాదులు, ఉద్యమకారులందరు విజయవంతం చేశారన్నారు. జేఏసీ నాయకులు బొంకూరి. సురేందర్ సన్ని,పాలకుర్తి కృష్ణ నాయకులతో కలిసికట్టుగా పోరాటం చేసి అంబేద్కర్ అభయహస్తం పథకాన్ని సాధించుకుంటామని అన్నారు. Follow us on Website Facebook Instagram YouTube