BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 23 July 2026, 08:36 pm
Posted by : V శ్రీనివాస్

​వైభవంగా వారాహి దేవి నవరాత్రి ఉత్సవాలు... ప్రత్యేక పూజలు చేసిన మేయర్ దంపతులు

తెలంగాణ
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
23 Jul, 2026 - 08:36 PM
122 వీక్షణలు

​వైభవంగా వారాహి దేవి నవరాత్రి ఉత్సవాలు... ప్రత్యేక పూజలు చేసిన మేయర్ దంపతులు

  • ​రెడ్డి కాలనీలో భక్తిశ్రద్ధలతో అమ్మవారి దర్శనం
  • ​ప్రజలందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలని ఆకాంక్షించిన మేయర్ దర్ని మధుకర్
  • మేయర్ దంపతులను సత్కరించిన నిర్వాహకులు, పురోహితులు

మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రెడ్డి కాలనీలో శ్రీ వాసుకి పరమేశ్వరి సేవా సంస్థ ఆధ్వర్యంలో శ్రీ పరాభవ నామ సంవత్సర ఆషాఢ మాస శ్రీ వారాహి దేవి నవరాత్రి ఉత్సవాలు అత్యంత భక్తిశ్రద్ధలతో కోలాహలంగా సాగుతున్నాయి. ఈ ఉత్సవాల సందర్భంగా మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దర్ని మధుకర్ - సుజాత దంపతులు వారాహి అమ్మవారిని దర్శించుకుని, విశేష పూజలు నిర్వహించారు.

​అనంతరం మేయర్ మాట్లాడుతూ.. అమ్మవారి ఆశీస్సులు సమస్త ప్రజలపై ఉండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖశాంతులతో వర్థిల్లాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఉత్సవాల నిర్వాహకులు, వేద పండితులు మేయర్ దంపతులను శాలువాతో ఘనంగా సత్కరించి, అమ్మవారి తీర్థప్రసాదాలు, ఆశీర్వచనాలు అందజేశారు.

​ఈ పూజా కార్యక్రమంలో మేయర్‌తో పాటు నూతనంగా ఎన్నికైన మంచిర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ రామగిరి బానేష్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు చిలువేరు శ్రీనివాస్, ఆలయ పురోహితులు వేణుగోపాల చారి, భారీ సంఖ్యలో భక్తులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.