పెద్దతండాలో ఆటో నడిపిన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్
ఆటోడ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలని బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ
మహబూబాబాద్ జిల్లా కురవి మండలం పెద్దతండాలో ఆటోడ్రైవర్ల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ స్వయంగా ఆటో నడిపి ఆటోడ్రైవర్లకు సంఘీభావం తెలిపారు.
అనంతరం బొడ్రాయి తల్లికి మొక్కి, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. ఆటోడ్రైవర్లు అధైర్యపడాల్సిన అవసరం లేదని, వారి సమస్యల పరిష్కారం కోసం బీఆర్‌ఎస్ అండగా ఉంటుందని సత్యవతి రాథోడ్ తెలిపారు.
ఆటోడ్రైవర్ల జీవనోపాధికి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాజీ జడ్పీ చైర్‌పర్సన్ ఆంగోత్ బిందుతో పాటు బీఆర్‌ఎస్ నాయకులు, ఆటోడ్రైవర్లు, ఆటో యజమానులు పాల్గొన్నారు.