శ్రీ వైష్ణవ సమారాధాన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు
శ్రీ వైష్ణవ సమారాధనలో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు
కార్తీక మాసంలో శ్రీ వైష్ణవ సంఘ భవనానికి స్థలం కేటాయిస్తామని హామీ
మంచిర్యాల | Ntoday News
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కాలేజీ రోడ్డులో ఉన్న BMA ఫంక్షన్ హాల్‌లో శ్రీ వైష్ణవ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ వైష్ణవ సమారాధన కార్యక్రమంలో మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ శ్రీ వైష్ణవ సంఘం భవన నిర్మాణం కోసం వచ్చే కార్తీక మాసంలో స్థలం కేటాయించేందుకు కృషి చేస్తానని తెలిపారు. సంఘం అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని పేర్కొన్నారు.
అనంతరం శ్రీ వైష్ణవ సంఘం కమిటీ సభ్యులు ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావును శాలువాతో ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కార్పొరేటర్ తూముల నరేష్, జిల్లా ఆత్మ కమిటీ చైర్మన్ సింగతి మురళి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ సల్ల మహేష్, నాయకులు, సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.