అద్భుతం 300 ఏళ్ళ తరువాత జలాభిషేకం
తెలంగాణ
/
హన్మకొండ
/
హన్మకొండ
TG: ములుగు జిల్లాలోని యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయంలో 300 ఏళ్లుగా నిలిచిపోయిన పూర్తి స్థాయి నిత్య జలాభిషేకం శనివారం ప్రారంభమైంది. 17వ శతాబ్దంలో సంభవించిన భూకంపం కారణంగా గర్భగుడి నుంచి నీరు బయటకు వెళ్లే సోమసూత్రం మూసుకుపోయింది. దీంతో సంపూర్ణ జలాభిషేకం ఆగిపోయింది. తాజాగా మోడ్రన్ టెక్నాలజీతో కట్టడానికి ఎలాంటి నష్టం లేకుండా అధికారులు అడ్డంకులను తొలగించి దీనిని విజయవంతంగా పునరుద్ధరించారు.