చలపర్తిలో జన్ను ఉప్పలమ్మ 21వ వర్ధంతి
చలపర్తి గ్రామంలో జన్ను ఉప్పలమ్మ 21వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. జన్ను శ్రీనివాస్ మాతృమూర్తి జ్ఞాపకార్థం నిర్వహించిన ఈ కార్యక్రమానికి బహుజన నాయకులు హాజరై చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
జన్ను ఉప్పలమ్మ 21వ వర్ధంతి
చలపర్తిలో జన్ను ఉప్పలమ్మ 21వ వర్ధంతి
చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన బహుజన నాయకులు
దుగ్గొండి: వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం దుగ్గొండి మండలం చలపర్తి గ్రామ పంచాయతీ పరిధిలో టి.డబ్ల్యూ.జే.ఎఫ్ వరంగల్ జిల్లా ఈసీ సభ్యుడు, మీడియా మిత్రుడు జన్ను శ్రీనివాస్ మాతృమూర్తి జన్ను ఉప్పలమ్మ 21వ వర్ధంతి కార్యక్రమాన్ని ఆదివారం ఆయన నివాసంలో నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి బీసీ సంక్షేమ సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షుడు, నర్సంపేట నియోజకవర్గ ఇన్‌చార్జి డ్యాగల శ్రీనివాస్ ముదిరాజ్, తెలంగాణ ఉద్యమకారుడు సంగెం మహేందర్, డాక్టర్ పరికి రుబెన్, బహుజన నాయకుడు ఈదుల కృష్ణ హాజరయ్యారు. జన్ను ఉప్పలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆమె కుటుంబ సభ్యులతో కలిసి ఉప్పలమ్మను స్మరించుకున్నారు. కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు పాల్గొన్నారు.