BREAKING
thumb ● ట్రాక్టర్‌ కింద పడి రైతు దుర్మరణం thumb ● అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లిన ట్రావెల్స్ బస్సు.. తృటిలో తప్పిన పెను ప్రమాదం thumb ● వేముల వీరేశం సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ప్రత్యేక పూజలు thumb ● ఎన్నికల సరళి, ఏర్పాట్లను పరిశీలించిన టీడీపీ పట్టణ అధ్యక్షుడు జి. విజయ్ కుమార్ thumb ● ఇందిరమ్మ బీమా పథకం ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. నవంబర్ 19న శ్రీకారం thumb ● కొడంగల్‌లో మూడు రోజుల పాటు సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన thumb ● భారత్ ఘన విజయం.. ఆరోసారి ఛాంపియన్‌గా టీమిండియా! thumb ● వెల్లంకి పాఠశాల విద్యార్థులకు రూ.30 వేల ఉపకార వేతనాలు thumb ● శంకుస్థాపన చేసిన మహిళా సంఘ భవన నిర్మాణం తక్షణమే చేపట్టాలి. thumb ● చిన్నారుల బంగారు భవిష్యత్తుకు తొలి అడుగు thumb ● ట్రాక్టర్‌ కింద పడి రైతు దుర్మరణం thumb ● అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లిన ట్రావెల్స్ బస్సు.. తృటిలో తప్పిన పెను ప్రమాదం thumb ● వేముల వీరేశం సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ప్రత్యేక పూజలు thumb ● ఎన్నికల సరళి, ఏర్పాట్లను పరిశీలించిన టీడీపీ పట్టణ అధ్యక్షుడు జి. విజయ్ కుమార్ thumb ● ఇందిరమ్మ బీమా పథకం ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. నవంబర్ 19న శ్రీకారం thumb ● కొడంగల్‌లో మూడు రోజుల పాటు సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన thumb ● భారత్ ఘన విజయం.. ఆరోసారి ఛాంపియన్‌గా టీమిండియా! thumb ● వెల్లంకి పాఠశాల విద్యార్థులకు రూ.30 వేల ఉపకార వేతనాలు thumb ● శంకుస్థాపన చేసిన మహిళా సంఘ భవన నిర్మాణం తక్షణమే చేపట్టాలి. thumb ● చిన్నారుల బంగారు భవిష్యత్తుకు తొలి అడుగు
Test 4
Date of Publish : 06 November 2026, 03:28 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

విస్సన్నపేటలో మరో లారీ బోల్తా.. వరుస ప్రమాదాలతోనూ స్పందించని అధికారులు!

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
06 Nov, 2026 - 03:28 PM
31 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేటలో లారీ ప్రమాదాలు నిత్యకృత్యంగా మారుతున్నా సంబంధిత అధికారుల్లో మాత్రం చలనం కనిపించడం లేదు. తాజాగా విస్సన్నపేటలోని వికాస్ కళాశాల సమీపంలో మరో లారీ అదుపుతప్పి బోల్తాపడింది. వరంగల్ నుంచి జంక్షన్ వైపు తౌడు లోడ్‌తో వెళ్తున్న లారీ ప్రమాదవశాత్తు అదుపుతప్పి రోడ్డుపై బోల్తాపడింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్ సురక్షితంగా బయటపడటంతో పెను ప్రమాదం తప్పింది. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. అయితే ఇదే ప్రాంతంలో గతంలోనూ పలుమార్లు లారీలు అదుపుతప్పి బోల్తాపడిన ఘటనలు చోటుచేసుకున్నాయి. అయినప్పటికీ ప్రమాదాల నివారణకు శాశ్వత చర్యలు చేపట్టడంలో సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వరుస ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు ఎందుకు స్పందించడం లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ప్రమాదకరంగా మారిన ఈ ప్రాంతంలో మరో ప్రాణం బలికాకముందే సంబంధిత శాఖల అధికారులు స్పందించి ప్రమాదాల నివారణకు తగిన చర్యలు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.