BREAKING
thumb ● ట్రాక్టర్‌ కింద పడి రైతు దుర్మరణం thumb ● అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లిన ట్రావెల్స్ బస్సు.. తృటిలో తప్పిన పెను ప్రమాదం thumb ● వేముల వీరేశం సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ప్రత్యేక పూజలు thumb ● ఎన్నికల సరళి, ఏర్పాట్లను పరిశీలించిన టీడీపీ పట్టణ అధ్యక్షుడు జి. విజయ్ కుమార్ thumb ● ఇందిరమ్మ బీమా పథకం ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. నవంబర్ 19న శ్రీకారం thumb ● కొడంగల్‌లో మూడు రోజుల పాటు సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన thumb ● భారత్ ఘన విజయం.. ఆరోసారి ఛాంపియన్‌గా టీమిండియా! thumb ● వెల్లంకి పాఠశాల విద్యార్థులకు రూ.30 వేల ఉపకార వేతనాలు thumb ● శంకుస్థాపన చేసిన మహిళా సంఘ భవన నిర్మాణం తక్షణమే చేపట్టాలి. thumb ● చిన్నారుల బంగారు భవిష్యత్తుకు తొలి అడుగు thumb ● ట్రాక్టర్‌ కింద పడి రైతు దుర్మరణం thumb ● అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లిన ట్రావెల్స్ బస్సు.. తృటిలో తప్పిన పెను ప్రమాదం thumb ● వేముల వీరేశం సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ప్రత్యేక పూజలు thumb ● ఎన్నికల సరళి, ఏర్పాట్లను పరిశీలించిన టీడీపీ పట్టణ అధ్యక్షుడు జి. విజయ్ కుమార్ thumb ● ఇందిరమ్మ బీమా పథకం ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. నవంబర్ 19న శ్రీకారం thumb ● కొడంగల్‌లో మూడు రోజుల పాటు సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన thumb ● భారత్ ఘన విజయం.. ఆరోసారి ఛాంపియన్‌గా టీమిండియా! thumb ● వెల్లంకి పాఠశాల విద్యార్థులకు రూ.30 వేల ఉపకార వేతనాలు thumb ● శంకుస్థాపన చేసిన మహిళా సంఘ భవన నిర్మాణం తక్షణమే చేపట్టాలి. thumb ● చిన్నారుల బంగారు భవిష్యత్తుకు తొలి అడుగు
Test 4
Date of Publish : 06 November 2026, 03:28 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

నూజివీడులో రేపు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
06 Nov, 2026 - 03:28 PM
23 వీక్షణలు

ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్.. 10 హాళ్లలో 108 టేబుళ్ల ఏర్పాటు

చాట్రాయి మండలానికి రెండు కౌంటింగ్ హాళ్లు

నూజివీడు, నవంబర్ 6: ఏలూరు జిల్లాలోని నూజివీడు డివిజన్ పరిధిలో ఆరు మండలాలకు సంబంధించిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు శనివారం (నవంబర్ 7) నిర్వహించనున్నారు. ఆగిరిపల్లి, చాట్రాయి, ముసునూరు, నూజివీడు, చింతలపూడి, లింగపాలెం మండలాల ఓట్ల లెక్కింపు నూజివీడు–మైలవరం రోడ్డులోని శ్రీ సారథి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో ఉదయం 8 గంటల నుంచి ప్రారంభం కానుంది. ఉదయం 7.30 గంటలకు రిటర్నింగ్ అధికారులు, అభ్యర్థులు లేదా వారి ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్ రూములను తెరవనున్నారు.

ఓట్ల లెక్కింపు కోసం మొత్తం 10 హాళ్లలో 108 కౌంటింగ్ టేబుళ్లను ఏర్పాటు చేశారు. నూజివీడు మండలానికి ఏ-201 హాల్‌లో 20 టేబుళ్లు, చాట్రాయి మండలానికి బీ-301, బీ-303 హాళ్లలో రెండు విడతలుగా 8 చొప్పున మొత్తం 16 టేబుళ్లు ఏర్పాటు చేశారు. చింతలపూడి మండలానికి రెండు హాళ్లలో 10 చొప్పున 20 టేబుళ్లు, లింగపాలెం మండలానికి 8, 10 టేబుళ్లతో రెండు హాళ్లు, ముసునూరు మండలానికి 8 చొప్పున రెండు హాళ్లు, ఆగిరిపల్లి మండలానికి 18 టేబుళ్లు కేటాయించారు.

మీడియా ప్రతినిధుల కోసం బీ బ్లాక్ మొదటి అంతస్తులోని బీ-202లో వెయిటింగ్ హాల్ ఏర్పాటు చేశారు. రిజర్వ్ సిబ్బందికి బీ-204లో ప్రత్యేక హాల్ కేటాయించారు. కౌంటింగ్ ఏజెంట్లు తమ మొబైల్ ఫోన్లతో సహా ఇతర వస్తువులను డిపాజిట్ కౌంటర్‌లో భద్రపరచాలి. ప్రతి వస్తువుకు టోకెన్ అందజేస్తారు. కౌంటింగ్ హాళ్లలోకి తాగునీటిని అనుమతించరు. హాళ్ల వెలుపల సిబ్బంది, ఏజెంట్లకు తాగునీటి సౌకర్యం కల్పించారు.

రిటర్నింగ్ అధికారులు జారీ చేసిన గుర్తింపు పాసులు కలిగిన వారిని మాత్రమే కౌంటింగ్ హాళ్లలోకి అనుమతించనున్నారు. అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లు తమకు కేటాయించిన మార్గాలు, కారిడార్లను మాత్రమే వినియోగించాలని అధికారులు సూచించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలు, నిబంధనల ప్రకారం ఓట్ల లెక్కింపు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. లెక్కింపు ప్రక్రియ పూర్తయిన వెంటనే సంబంధిత రిటర్నింగ్ అధికారులు హాల్ వారీగా ఫలితాలను ప్రకటించనున్నారు. కౌంటింగ్ సజావుగా సాగేందుకు మీడియా ప్రతినిధులు, అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లు సహకరించాలని అధికారులు కో

రారు.