BREAKING
thumb ● ట్రాక్టర్‌ కింద పడి రైతు దుర్మరణం thumb ● అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లిన ట్రావెల్స్ బస్సు.. తృటిలో తప్పిన పెను ప్రమాదం thumb ● వేముల వీరేశం సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ప్రత్యేక పూజలు thumb ● ఎన్నికల సరళి, ఏర్పాట్లను పరిశీలించిన టీడీపీ పట్టణ అధ్యక్షుడు జి. విజయ్ కుమార్ thumb ● ఇందిరమ్మ బీమా పథకం ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. నవంబర్ 19న శ్రీకారం thumb ● కొడంగల్‌లో మూడు రోజుల పాటు సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన thumb ● భారత్ ఘన విజయం.. ఆరోసారి ఛాంపియన్‌గా టీమిండియా! thumb ● వెల్లంకి పాఠశాల విద్యార్థులకు రూ.30 వేల ఉపకార వేతనాలు thumb ● శంకుస్థాపన చేసిన మహిళా సంఘ భవన నిర్మాణం తక్షణమే చేపట్టాలి. thumb ● చిన్నారుల బంగారు భవిష్యత్తుకు తొలి అడుగు thumb ● ట్రాక్టర్‌ కింద పడి రైతు దుర్మరణం thumb ● అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లిన ట్రావెల్స్ బస్సు.. తృటిలో తప్పిన పెను ప్రమాదం thumb ● వేముల వీరేశం సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ప్రత్యేక పూజలు thumb ● ఎన్నికల సరళి, ఏర్పాట్లను పరిశీలించిన టీడీపీ పట్టణ అధ్యక్షుడు జి. విజయ్ కుమార్ thumb ● ఇందిరమ్మ బీమా పథకం ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. నవంబర్ 19న శ్రీకారం thumb ● కొడంగల్‌లో మూడు రోజుల పాటు సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన thumb ● భారత్ ఘన విజయం.. ఆరోసారి ఛాంపియన్‌గా టీమిండియా! thumb ● వెల్లంకి పాఠశాల విద్యార్థులకు రూ.30 వేల ఉపకార వేతనాలు thumb ● శంకుస్థాపన చేసిన మహిళా సంఘ భవన నిర్మాణం తక్షణమే చేపట్టాలి. thumb ● చిన్నారుల బంగారు భవిష్యత్తుకు తొలి అడుగు
Test 4
Date of Publish : 06 November 2026, 03:29 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

విస్సన్నపేట ప్రజాశక్తి విద్యాసంస్థ కార్యాలయంలో బాల్య వివాహాల నిరోధక చట్టంపై అవగాహన

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
06 Nov, 2026 - 03:29 PM
19 వీక్షణలు

కార్యక్రమం బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలి సీపీఐ ఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి. హరినాథ్ విస్సన్నపేట, నవంబర్ 06: ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేటలోని ప్రజాశక్తి విద్యాసంస్థ కార్యాలయంలో ఐడియాస్ సంస్థ పర్యవేక్షణలో బాల్య వివాహాల నిరోధక చట్టంపై విద్యార్థినీ విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీపీఐ ఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి. హరినాథ్ మాట్లాడుతూ రాష్ట్రం ఎంతో అభివృద్ధి సాధించిందని చెప్పుకుంటున్న ప్రస్తుత తరుణంలోనూ బాల్య వివాహాలు కొనసాగుతుండటం సిగ్గుపడాల్సిన విషయమని అన్నారు. బాల్య వివాహాల నిర్మూలనకు సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా బాల్య వివాహాల రద్దు, బాలల హక్కులకు సంబంధించిన గోడపత్రికలను హరినాథ్, ఏ. సౌరి, భాస్కర్, కృష్ణకుమారి, చంద్రమౌళి తదితరులు ఆవిష్కరించారు. బాలికల పట్ల ఇటీవల ప్రేమ పేరుతో హింస, దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయని హరినాథ్ ఆందోళన వ్యక్తం చేశారు. అనంతపురంలో పదో తరగతి విద్యార్థినిపై విద్యుత్ రంపంతో దాడి చేయడం అత్యంత హేయమైన చర్యగా అభివర్ణించారు. బాలికల భద్రత, బాలల హక్కుల పరిరక్షణపై ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనలో ప్రభుత్వాలు ఆశించిన స్థాయిలో చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు బాధ్యతగా ముందుకొచ్చి బాల కార్మికులను ఆ వ్యవస్థ నుంచి విముక్తి చేసి, వారందరికీ విద్య అందించేలా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. చదువుకు దూరమవుతున్న చిన్నారులను గుర్తించి అక్షరాస్యులుగా తీర్చిదిద్దడం సమాజ బాధ్యత అని పేర్కొన్నారు. ఇదే కార్యక్రమంలో తల్లిదండ్రులు లేని పది మంది అనాథ పిల్లల చదువును ప్రోత్సహించేందుకు ఐడియాస్ సంస్థ తరఫున ఒక్కొక్కరికి రూ.1,000 చొప్పున ఆర్థిక సహాయం అందజేశారు. ఈ నగదును ఏ. సౌరి, డి. హరినాథ్ చేతుల మీదుగా చిన్నారులకు అందించారు. ఈ కార్యక్రమంలో చేకూరి భాస్కరరావు, కృష్ణకుమారి, నాగేంద్రమ్మ, చంద్రమౌళి, అవ్వారి సౌరి, మీనాక్షి తదితరులు పాల్గొన్నారు.