BREAKING
thumb ● పర్యాటక శాఖ అవార్డు గ్రహీతలకు బీజేపీ నేత జయరాం సన్మానం thumb ● వీఆర్ఏల దీక్షకు వ్యవసాయ కార్మిక సంఘం మద్దతు thumb ● తనకల్లు మండలంలో వైఎస్సార్‌సీపీ సమీక్షా సమావేశం thumb ● సరసపల్లి ఎంపీపీ పాఠశాల విద్యార్థులకు ఉచిత యూనిఫామ్స్ పంపిణీ thumb ● జీడిపల్లిలో అంగన్‌వాడీ, ఆశా వర్కర్లకు సన్మానం thumb ● నంద్యాలలో రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన ర్యాలీ thumb ● పెద్దతండలో అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించిన బీజేపీ నాయకులు thumb ● నంద్యాల జిల్లాలో 28 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తింపు thumb ● తాను లేదు గాని ముగ్గురికి ప్రాణం పోసిన నంద్యాల మహిళ thumb ● ఆత్రేయపురంలో 17వ రోజుకు చేరిన వీఆర్ఎల సమ్మె thumb ● పర్యాటక శాఖ అవార్డు గ్రహీతలకు బీజేపీ నేత జయరాం సన్మానం thumb ● వీఆర్ఏల దీక్షకు వ్యవసాయ కార్మిక సంఘం మద్దతు thumb ● తనకల్లు మండలంలో వైఎస్సార్‌సీపీ సమీక్షా సమావేశం thumb ● సరసపల్లి ఎంపీపీ పాఠశాల విద్యార్థులకు ఉచిత యూనిఫామ్స్ పంపిణీ thumb ● జీడిపల్లిలో అంగన్‌వాడీ, ఆశా వర్కర్లకు సన్మానం thumb ● నంద్యాలలో రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన ర్యాలీ thumb ● పెద్దతండలో అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించిన బీజేపీ నాయకులు thumb ● నంద్యాల జిల్లాలో 28 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తింపు thumb ● తాను లేదు గాని ముగ్గురికి ప్రాణం పోసిన నంద్యాల మహిళ thumb ● ఆత్రేయపురంలో 17వ రోజుకు చేరిన వీఆర్ఎల సమ్మె
Date of Publish : 19 August 2026, 09:34 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

అవార్డు అందుకున్న మూడు రోజులకే లంచం కేసులో ఏసీబీ వలలో ఉద్యోగి

ఆంధ్రప్రదేశ్
/ ప్రకాశం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
19 Aug, 2026 - 09:34 AM
111 వీక్షణలు

ఒంగోలు మున్సిపాలిటీలో రెవెన్యూ ఇన్స్పెక్టర్‌పై అవినీతి ఆరోపణలు

ఒంగోలు: ఆగస్టు 15 సందర్భంగా ఉత్తమ ఉద్యోగిగా గుర్తింపు పొంది అవార్డు అందుకున్న ఓ ఉద్యోగి, ఆ తర్వాత లంచం ఆరోపణలతో ఏసీబీకి చిక్కడం చర్చనీయాంశంగా మారింది.

ఒంగోలు మున్సిపాలిటీలో రెవెన్యూ ఇన్స్పెక్టర్‌గా పనిచేస్తున్న నరేంద్ర ఓ ఇంటికి పన్ను విధించే విషయంలో రూ.15 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నట్లు సమాచారం.

ఇటీవలే మంత్రి, జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఉత్తమ ఉద్యోగి అవార్డు అందుకున్న నరేంద్రపై లంచం ఆరోపణలు రావడంతో పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అవార్డుల ఎంపిక ప్రక్రియలో మరింత పారదర్శకత అవసరమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రభుత్వ సేవల్లో నిజాయితీ, నిబద్ధతకు ప్రాధాన్యం ఇచ్చి అవార్డుల ఎంపిక జరగాలని ప్రజలు కోరుతున్నారు. అయితే ఏసీబీ కేసులో పూర్తి విచారణ అనంతరం వాస్తవాలు వెలుగులోకి రానున్నాయి.