BREAKING
thumb ● జీడిపల్లిలో అంగన్‌వాడీ, ఆశా వర్కర్లకు సన్మానం thumb ● నంద్యాలలో రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన ర్యాలీ thumb ● పెద్దతండలో అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించిన బీజేపీ నాయకులు thumb ● నంద్యాల జిల్లాలో 28 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తింపు thumb ● తాను లేదు గాని ముగ్గురికి ప్రాణం పోసిన నంద్యాల మహిళ thumb ● ఆత్రేయపురంలో 17వ రోజుకు చేరిన వీఆర్ఎల సమ్మె thumb ● మునగపాకలో గాంధీ విగ్రహానికి అంగన్‌వాడీల వినతి thumb ● ఆత్రేయపురం మండల పరిషత్ కార్యాలయములో గాంధీ జయంతి వేడుకలు thumb ● మునగపాకలో లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు thumb ● మునగపాకలో వైసీపీ ఎస్సీ సెల్ నేతల ఆత్మీయ సమావేశం thumb ● జీడిపల్లిలో అంగన్‌వాడీ, ఆశా వర్కర్లకు సన్మానం thumb ● నంద్యాలలో రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన ర్యాలీ thumb ● పెద్దతండలో అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించిన బీజేపీ నాయకులు thumb ● నంద్యాల జిల్లాలో 28 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తింపు thumb ● తాను లేదు గాని ముగ్గురికి ప్రాణం పోసిన నంద్యాల మహిళ thumb ● ఆత్రేయపురంలో 17వ రోజుకు చేరిన వీఆర్ఎల సమ్మె thumb ● మునగపాకలో గాంధీ విగ్రహానికి అంగన్‌వాడీల వినతి thumb ● ఆత్రేయపురం మండల పరిషత్ కార్యాలయములో గాంధీ జయంతి వేడుకలు thumb ● మునగపాకలో లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు thumb ● మునగపాకలో వైసీపీ ఎస్సీ సెల్ నేతల ఆత్మీయ సమావేశం
Date of Publish : 03 October 2026, 02:04 pm
Posted by : KETHAVATH NITHIN

పెద్దతండలో అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించిన బీజేపీ నాయకులు

తెలంగాణ
/ తెలంగాణ / మేడక్ / మెదక్
Reporter
Kethavath Nithin NARSINGI MANDAL
03 Oct, 2026 - 02:04 PM
24 వీక్షణలు

నార్సింగి: సేవా సంపర్క్ అభియాన్‌లో భాగంగా నార్సింగి మండలం పెద్దతండలోని అంగన్‌వాడీ కేంద్రాన్ని శుక్రవారం బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో నాయకులు సందర్శించారు.

ఈ సందర్భంగా చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పోషకాహార లోపం లేకుండా ప్రభుత్వం ద్వారా వివిధ రకాల ఆహారాన్ని అందిస్తున్న విషయాన్ని స్థానికులకు వివరించారు. కేంద్రంలో అందుతున్న పోషకాహారం, ఇతర సేవలపై వివరాలు తెలుసుకున్నారు.

చిన్నారులు, గర్భిణుల ఆరోగ్యంపై దృష్టి సారిస్తూ పోషకాహారం అందిస్తున్నందుకు మహిళలు ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపారు.

కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు శిర్న చంద్రశేఖర్, శక్తి కేంద్ర ఇన్‌చార్జి దాయం నరేష్, పెద్దతండ బూత్ అధ్యక్షుడు నరేష్ నాయక్, కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు యెన్నం లింగారెడ్డి, నార్సింగి పట్టణ అధ్యక్షుడు మైలారం నరసింహులు, మెదక్ జిల్లా ఓబీసీ మోర్చా కార్యవర్గ సభ్యుడు పున్న రమేష్, మండల కోశాధికారి గురుపాదం, సీనియర్ నాయకుడు మన్నె యాదగిరి, వార్డు సభ్యుడు నితిన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.